Site icon NTV Telugu

RBI: ఈఎంఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మరోసారి రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ

Rbi

Rbi

ఈఎంఐ చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా మూడోసారి రెపోరేటును తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. రెపోరేటు 6 నుంచి 5.5 శాతానికి తగ్గించింది. దీంతో హోమ్‌ లోన్, వెహికల్‌, పర్సనల్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Shubman Gill: ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటా.. ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదు!

ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లోనూ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు ఒక శాతం వరకు తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్నా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా కొనసాగుతోంది. వేగంగా వృద్ధి చెందుతోంది. పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోంది.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక అడుగు.. ప్రధానికి పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు

ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని, స్వల్పకాలిక, మధ్యకాలిక అంచనాలు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని మల్హోత్రా అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం అంచనాలు ఇప్పటికీ మృదువుగా ఉన్నాయని, ప్రధాన ద్రవ్యోల్బణం సానుకూలంగానే ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4 శాతం ఉంటుందని అంచనా వేయగా.. అది 3.7 శాతం దగ్గర ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. వివిధ ఆర్థిక సూచికలు మాత్రం బలంగా ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధిని ఆర్బీఐ 6.5 శాతంగా అంచనా వేసింది. త్రైమాసిక అంచనాలు: 2.9 శాతం (ఏప్రిల్-జూన్), 3.4 శాతం (జూలై-సెప్టెంబర్), 3.9 శాతం (అక్టోబర్-డిసెంబర్), మరియు 4.4 శాతం (జనవరి-మార్చి) అంచనా వేసింది.

Exit mobile version