Bank Licence Cancelled: ఆ బ్యాంక్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రకు చెందిన ‘ది యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్’ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఈ బ్యాంక్ నడపడానికి తగినంత మూలధనం (డబ్బు) లేదని, అలాగే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకింగ్ నిబంధనలను ఈ బ్యాంక్ సరిగ్గా పాటించలేకపోయిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతాదారులందరికీ పూర్తి డబ్బులు తిరిగి ఇచ్చే శక్తి ఈ బ్యాంక్‌కు లేదని స్పష్టం చేసింది. ఇలాంటి బ్యాంకును ఇంకా కొనసాగించడం వల్ల ప్రజల సొమ్ముకే ప్రమాదమని భావించిన ఆర్బీఐ.. మే 19, 2026 (మంగళవారం) సాయంత్రం నుంచి బ్యాంక్ వ్యాపార లావాదేవీలను పూర్తిగా నిలిపివేసింది.
ఖాతాదారుల డబ్బు పరిస్థితి ఏమిటి?
బ్యాంక్ మూతపడినప్పటికీ ఖాతాదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) నియమం ప్రకారం.. ప్రతి ఖాతాదారునికి వారి డిపాజిట్లపై రూ. 5 లక్షల వరకు బీమా (ఇన్సూరెన్స్) లభిస్తుంది. ఈ బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దాదాపు 99.02 శాతం మంది ఖాతాదారులకు వారి పూర్తి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 20, 2026 నాటికే బీమా సంస్థ (DICGC) ఖాతాదారులకు రూ. 106.96 కోట్లను చెల్లించింది. మిగిలిన వారికి కూడా నిబంధనల ప్రకారం డబ్బు అందుతుంది.
Also Read
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
- LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
బ్యాంకును పూర్తిగా మూసివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని.. ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని మహారాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్‌ను ఆర్బీఐ కోరింది. ఇకపై ఈ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లను తీసుకోలేదు.. అలాగే ఎవరికీ డబ్బులు చెల్లించలేదు.
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!