2026 Bank Holidays List: 2025కు బైబై చెప్పేసి.. 2026 ఏడాదికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను అధికారికంగా ప్రకటించింది.. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి వంటి జాతీయ సెలవుల రోజుల్లో బ్యాంకులు పనిచేయని విషయం విదితమే కాగా.. హోలీ, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగల సమయంలోనూ బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. వీటితో పాటు ప్రతి నెలలో వచ్చే రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులుగా కొనసాగుతోన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరోవైపు, ప్రాంతీయ పండుగలు, రాష్ట్రాల ప్రత్యేక సందర్భాలు ఆధారంగా సెలవుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా మినహాయింపు కావు.
2026లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవులను పరిశీలిస్తే..
జనవరి
*మకర సంక్రాంతి – 15 జనవరి
* గణతంత్ర దినోత్సవం (Republic Day) – 26 జనవరి
మార్చి
* హోలీ – 3 మార్చి
* ఉగాది – 19 మార్చి
* రంజాన్ (Ramzan/Eid-ul-Fitr) – ఏపీలో 20, తెలంగాణలో 21 మార్చి
* శ్రీరామ నవమి – 27 మార్చి
ఏప్రిల్
* అకౌంట్స్ క్లోజింగ్ డే – 1 ఏప్రిల్
* గుడ్ ఫ్రైడే – 3 ఏప్రిల్
* డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి – 14 ఏప్రిల్
మే
* మే డే (Labour Day) – 1 మే
* బక్రీద్ (Eid-ul-Adha) – 27 మే
జూన్
* మొహర్రం (Muharram) – ఏపీలో 25, తెలంగాణలో 26 జూన్
ఆగస్టు
* స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) – 15 ఆగస్టు
* మిలాద్ ఉన్ నబీ (Milad-un-Nabi) – ఏపీలో 25, తెలంగాణలో 26 ఆగస్టు
సెప్టెంబర్
* శ్రీకృష్ణ జన్మాష్టమి – 4 సెప్టెంబర్
* వినాయక చవితి (Ganesh Chaturthi) – 14 సెప్టెంబర్
అక్టోబర్
* గాంధీ జయంతి – 2 అక్టోబర్
* విజయ దశమి (Dussehra) – 20 అక్టోబర్
నవంబర్
* గురునానక్ జయంతి – 24 నవంబర్ (ఏపీలో సెలవు ఉంటుంది, తెలంగాణలో లేదు)
* దీపావళి – 8 నవంబర్ (ఆదివారం కావడంతో సాధారణ సెలవు)
డిసెంబర్
* క్రిస్మస్ – 25 డిసెంబర్
