Site icon NTV Telugu

RBI Approved Loan Apps: రూ.లక్షల్లో లోన్.. 2 నిమిషాల్లోనే.. ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాపులర్‌లోన్ యాప్స్ ఎంటో తెలుసా?

Rbi Approved Loan Apps

Rbi Approved Loan Apps

RBI Approved Loan Apps: అత్యవసర సమయాల్లో డబ్బు అవసరం అయితే మీరు ఏం చేస్తారు. ఈ ఆధునిక కాలంలో అందరికీ మొదట గుర్తుకు వచ్చేది పర్సనల్ లోన్. కాలం మారింది కాబట్టి ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అన్ని బ్యాంకులు ఈజీ ప్రాసెస్‌తో వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. మీకు తెలుసా వీటికి అడ్వాన్స్‌డ్ వెర్షన్స్‌గా లోన్ యాప్స్ కూడా వచ్చి పాపులర్ అయ్యాయని. ఇక్కడ మీరో విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి. అది ఏంటంటే వీటిలో కొన్నింటికి మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం ఉంది. ఇంతకీ ఆర్బీఐ ఆమోదం పొందిన ఈ లోన్ యాప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Rajahmundry: పుష్కర్ ఘాట్‌లో స్థానానికి వెళ్లి ఇద్దరు భవానీలు గల్లంతు..

ఆర్బీఐ అనుమతి పొందిన 10 పాపులర్ లోన్ యాప్స్ ..

ఫైబ్ (Fibe) – ఈ యాప్‌లో కేవలం 2 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. జీరో ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉంటాయి. ఈ ప్లాట్‌ఫామ్ మ్యూచువల్ ఫండ్స్‌పై కూడా లోన్లు అందిస్తుంది.

జెస్ట్‌మనీ (ZestMoney) – ఈ లోన్ యాప్‌లో ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేదు. ఇది రూ.2 లక్షల వరకు క్రెడిట్ ఫెసిలిటీ అందిస్తుంది. కస్టమర్ లోన్‌ అమౌంట్‌ను 3, 6, 9 లేదా 12 భాగాలలో తిరిగి చెల్లించవచ్చు.

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ – ఈ బ్యాంకు ఏడాదికి 9.99 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. రీపేమెంట్ టైం వచ్చేసి 9 నుంచి 60 నెలల వరకు ఉంటుంది.

ఆదిత్య బిర్లా క్యాపిటల్ – ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంవత్సరానికి 19.45 శాతం వడ్డీతో 12 నెలల వరకు టెన్యూర్‌తో ఇన్‌స్టంట్ లోన్లు అందిస్తోంది. 12 నెలల కంటే ఎక్కువ టెన్యూర్ అయితే, సంవత్సరానికి 20.45 శాతం వడ్డీ ఉంటుంది. అయితే కస్టమర్‌కు మినిమం క్రెడిట్ స్కోరు 650 ఉండాలి.

క్రెడిట్ బీ – క్రెడిట్ బీ రూ.6 వేల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ ఆఫర్ చేస్తుంది. వడ్డీరేటు ఏడాదికి 12 నుంచి 28 శాతం మధ్యలో ఉంటుంది. ఈ మొత్తాన్ని 6 నెలల నుంచి 60 నెలల లోపు రీపేమెంట్ చేయవచ్చు.

CASHe – ఈ యాప్‌లో రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. టెన్యూర్ 9 నెలల నుంచి 18 నెలల వరకు ఉంటుంది.

mPokket – ఇది రూ.50 వేల వరకు క్రెడిట్ లిమిట్‌తో చిన్న రుణాలను అందిస్తుంది. KYC కోసం కస్టమర్లు పాన్, ఆధార్, ఇతర డాక్యుమెంట్లు సమర్పించాలి. లోన్ మొత్తాన్ని ఒకేసారి లేదా EMIలలో తిరిగి చెల్లించవచ్చు.

మనీ వ్యూ- ఇది తక్కువ సమయంలో రూ.10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. టెన్యూర్ 3 నెలల నుంచి 60 నెలల వరకు ఉంటుంది.

స్టాష్‌ఫిన్ – స్టాష్‌ఫిన్ యాప్‌లో రూ.5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్‌తో లోన్ తీసుకోవచ్చు. 30 రోజుల ఇంట్రస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. అంటే నెల రోజులు వడ్డీ పడదు.

లేజీ పే – లేజీ పే ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ లేకుండా రూ.3,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ అందిస్తుంది. అయితే కస్టమర్ KYC, బ్యాంక్ వివరాలను సమర్పించాలి, ఆటో-పే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి, లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. లోన్ రీపేమెంట్ పీరియడ్ 3 నుంచి 24 నెలల వరకు ఉంటుంది.

అత్యవసర సమయంలో లోన్ యాప్‌ల ద్వారా చాలా వేగంగా, ఈజీగా డబ్బు అప్పుగా తీసుకోవచ్చు. ఎవరికైతే డబ్బు అవసరం ఉంటుందో వాళ్లు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న వెంటనే, లెండర్స్ eKYC ప్రాసెస్ రిక్వెస్ట్ చేస్తారు. మీ క్రెడిట్ రిపోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, పేస్లిప్స్ వెరిఫై చేసిన తర్వాత మీ రీపేమెంట్ కెపాసిటీని అంచనా వేస్తారు. ఆ తర్వాత లోన్ ఆమోదం పొందుతుంది. తర్వాత ప్రాసెసింగ్ ఛార్జీలు కట్ చేసి, మిగతా అమౌంట్‌ను మీ అకౌంట్‌కు క్రెడిట్ చేస్తారు. గుర్తింపు పొందిన ఫిన్‌టెక్ కంపెనీల లోన్ యాప్స్ నుంచి మాత్రమే డబ్బు అప్పుగా తీసుకోవాల ఆర్బీఐ, ప్రభుత్వాలు, ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు. ఫేక్ యాప్స్, ఏజెంట్ల వలలో పడితే మోసపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

READ ALSO: Manchu Manoj: తేజ సజ్జాతో గొడవలపై స్పందించిన మనోజ్

Exit mobile version