Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Rakesh Jhunjhunwala King Of Dalal Street Rakesh Jhunjhunwala Life Story

Rakesh Jhunjhunwala: కింగ్ ఆఫ్ దలాల్ స్ట్రీట్.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

Published Date :August 18, 2022 , 3:46 pm
By Akkirala Kondala Rao
Rakesh Jhunjhunwala: కింగ్ ఆఫ్ దలాల్ స్ట్రీట్.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rakesh Jhunjhunwala: కొంత మంది వ్యక్తులను కారణజన్ములంటారు. ఎందుకంటే వాళ్లు ఆయా రంగాలపై చెరగని ముద్ర వేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుంటారు. అలాంటివారిలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కూడా ఒకరు. షేర్ల విలువలు రోజుకొక రకంగా మారిపోయే స్టాక్ మార్కెట్‌లో రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి నమ్మశక్యంకాని విజయాలను సొంతం చేసుకున్నారు. ఒక్క రోజే ఏకంగా 875 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు.

రూ.5 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో కెరీర్‌ని ప్రారంభించిన రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఇవాళ రూ.46,000 కోట్ల  సంపదను సృష్టించారంటే షేర్ మార్కెట్‌పై ఆయన ఎంత పట్టు సాధించారో అర్థంచేసుకోవచ్చు. అందుకే.. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాని ఇండియన్‌ వారెన్ బఫెట్ అంటారు. బిగ్ బుల్ అంటూ స్టాక్ మార్కెట్ పరిభాషలోనూ పిలుస్తారు. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా షేర్‌ మార్కెట్‌లో భారీగా లాభాల పంట పండించటమేకాకుండా ‘కింగ్ ఆఫ్ దలాల్ స్ట్రీట్’ అనే కీర్తిప్రతిష్టలనూ సంపాదించారు.

ఇండియా మొత్తం ఇలా ఫేమస్ అయిన ఆయన 1960లో మన హైదరాబాద్‌లోనే పుట్టడం మనకు గర్వకారణమని చెప్పొచ్చు. అయితే.. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన కుటుంబం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి వెళ్లింది. సిండెన్‌హామ్ కాలేజ్‌లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా 1985లో సీఏ పూర్తి చేశారు. అదే సంవత్సరం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ముందుగా టాటా టీ కంపెనీ వాటాలను కొనుగోలు చేశారు.

ఏడాది తిరిగే సరికి ఆ షేర్ల విలువ మూడున్నర రెట్లు పెరిగింది. దీంతో అనూహ్యంగా 5 లక్షల రూపాయల లాభం వచ్చింది. 2017లో టైటాన్ సంస్థ షేర్ వ్యాల్యూ అమాంతం పెరగటంతో ఒక్క రోజులోనే 875 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పటికీ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని మోస్ట్ వ్యాల్యుబుల్ లిస్టెడ్ హోల్డింగ్ టైటానే కావటం విశేషం. ఆయనకు స్టాక్ మార్కెట్‌పై ఎంత గ్రిప్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు బోల్తా కొట్టిన సందర్భాలూ ఉన్నాయి.

2008లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యంతో రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా షేర్ల విలువ 30 శాతం పతనమైంది. తిరిగి కోలుకోవటానికి 4 సంవత్సరాలు పట్టింది. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా పైన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విచారణ జరిపింది. గతేడాది 35 కోట్ల రూపాయలు చెల్లించాక ఎట్టకేలకు ఈ ఇష్యూ సెటిలైంది. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా తన పెట్టుబడులను స్టాక్ మార్కెట్‌కి మాత్రమే పరిమితం చేయలేదు.

Adani Group: దిగ్గజ సంస్థలను వెనక్కి నెట్టి అదానీ గ్రూప్‌ కంపెనీ అరుదైన ఘనత

బాలీవుడ్‌లోకీ అడుగుపెట్టారు. ఇంగ్లిష్ వింగ్లిష్, షమితాబ్, ‘కీ అండ్ కా’ అనే 3 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తర్వాత.. పోషకాహారం, విద్య తదితర రంగాల్లోకి ప్రవేశించారు. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా తన సంపదలోని 4వ శాతాన్ని సామాజిక సేవకు కేటాయించారు. తండ్రి కోరిక మేరకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకునేవారు. గతేడాది ఆకాశ ఎయిర్ లైన్స్ ఏర్పాటులో సహవ్యవస్థాపకుడిగా ఉన్నారు.

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా లైఫ్ జర్నీపై ఒక పాపులర్ బ్లాగ్ నడిచేది. దాని పేరు ”ది సీక్రెట్ జర్నల్ ఆఫ్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా”. ఆయనపై ఒక నవల కూడా వచ్చింది. ”హౌ టు బికం బిలియనీర్ బై సెల్లింగ్ నథింగ్’’ అనేది ఆ నవల పేరు. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఒక మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సక్సెస్ స్టోరీని చమత్కారంగా చెప్పారు. స్టాక్ మార్కెట్ల తీరును మహిళల వ్యవహార శైలితో పోల్చారు. షేర్ మార్కెట్లు స్త్రీల మాదిరిగా ప్రవర్తిస్తాయి.

మన మీద ఎప్పుడూ కమాండింగ్ చేస్తూ ఉంటాయి. ఎంత పరిశోధించినా ఒక పట్టాన అర్థంకావు. క్షణక్షణం ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తాయి. ఈ అభిప్రాయంతో లేడీస్‌ కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నా” అంటూ సరదాగా ముగించారు. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా భోజన ప్రియుడు. దోశలు బాగా లాగిస్తారు. చైనీస్ ఫుడ్డుకి ఆయన వీరాభిమాని. అలాగే.. గుర్రపు పందేలను ఎంతో ఇష్టంగా చూసేందుకు రోజూ మహాలక్ష్మి రేస్ కోర్స్‌కి వెళ్లేవారు.

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకి స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అదే పనిగా పొగతాగేవారు. భారత స్టాక్‌ మార్కెట్‌ ముద్దుబిడ్డ అంటూ మదుపరులు అభిమానంగా పిలుచుకునే రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా 62 సంవత్సరాల వయసులోనే అకాల మరణం చెందటం యావద్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఎన్‌-బిజినెస్‌ ఘన నివాళులర్పిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Big Bull
  • king of dalal street
  • Rakesh Jhunjhunwala
  • stock market star

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions