ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ గురించి తెలియని వాళ్లు ఉండరు.. అత్యంత సంపన్నుడు.. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేశారంటే మాటలు కాదు.. ఈ పెళ్లి వేడుకలను గుజరాత్ లోని జామ్ నగర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి.. ఆ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలు అందరు హాజరయ్యారు. ఒక పెద్ద పండగలాగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కు అంబానీ కుటుంబంలోని ఆడవాళ్లు ధరించిన చీరలు, నగలు అందరిని ఆకర్శించాయి..
ఈ వేడుకలో నీతా అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కూతురు ఈషా అంబానీ ధరించిన లగ్జరీయస్ నగలు, చీరలు పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ఇక నీతా అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చంట్ ధరించిన ఒక్కో డ్రెస్సు అందరిని తెగ ఆకర్శించింది.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కాబోయే పెళ్లి కూతురు, అందులోనూ ముఖేశ్ అంబానీ రేంజ్‌కి తగ్గట్లే డిజైన్ చేయించారు..
ఈ ప్రీ వెడ్డింగ్ చివరి రోజున ఆమె ధరించిన లెహంగాను బంగారం దారంతో తయారు చేశారట.. డ్రస్‌పై ధరించే దుప్పటను తయారు చేసేందుకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టిందట. దీన్ని ప్రముఖ డిజైన్‌ర్ మనీష్ మల్హోత్రా రూపొందించారట… ధర కూడా కోట్లల్లో ఉంటుందని అంచనా.. ఇక ఆమె ధరించిన నగలు అన్ని ప్రత్యేకమైన డైమండ్స్ లతో తయారు చేసినవే అని తెలుస్తుంది.. ఈ వేడుకకు దాదాపు 1500 మంది ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది..