చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం శుక్రవారం యథాతథంగా ఉంచింది. గత త్రైమాసికంలో కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. తాజాగా మరోసారి అదే విధానాన్ని కొనసాగించింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్థికశాఖ శుక్రవారం ప్రకటించింది. పాత వడ్డీ రేట్లే జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Insect repellents: వర్షాకాలంలో దోమలు, కీటకాలు ఇంట్లోకి వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకంపై 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై 7.1 శాతం, సేవింగ్స్ డిపాజిట్‌పై 4.0 శాతం, కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం శాతం ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7 శాతం, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభించనుంది. ఈ వడ్డీ రేట్లే సెప్టెంబరుతో ముగిసే త్రైమాసికం వరకు ఉంటాయని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Medigadda: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద