Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునే యువతకు, నిరుద్యోగులకు భారత తపాలా శాఖ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. తపాలా సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ‘పోస్టల్ ఫ్రాంచైజీ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో.. స్వయం ఉపాధిని పొందవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఒక మంచి అవకాశం. నిరుద్యోగులు తమ ఖాళీ సమయాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా.. ప్రభుత్వ సేవల్లో భాగస్వాములు కావచ్చు. చిన్న వ్యాపారం చేసుకునే వారు కూడా తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక.
పోస్టల్ ఫ్రాంచైజీ వివరాలు..
తపాలా సేవలను విస్తరించడంలో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కొత్త అవుట్‌లెట్ల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్నారు.
Also Read
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
సికింద్రాబాద్ , వికారాబాద్ ప్రాంతాల నివాసితులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కిరాణా షాపులు, స్టేషనరీ షాపులు, పాన్ షాపులు లేదా ఇతర చిన్న వ్యాపారాలు నడుపుతున్న వారు తమ దుకాణాల్లోనే ఈ పోస్టల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువతకు ఇది ఒక చక్కని ఉపాధి మార్గం. దరఖాస్తుదారుల వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. కనీసం ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే.. కేవలం డెలివరీ పనుల కోసం దరఖాస్తు చేసే వారు 10వ తరగతి పాసైతే సరిపోతుంది. కంప్యూటర్‌పై ప్రాథమిక అవగాహన ఉండాలి. స్మార్ట్‌ఫోన్ యాప్‌లను వాడటం తెలిసి ఉండాలి.
స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్ మాట్లాడటం, రాయడం తెలిసి ఉండాలి. డెలివరీ పనుల కోసం దరఖాస్తు చేసే వారికి సొంత వాహనం (టూ వీలర్ లేదా ఫోర్ వీలర్) మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అందరికీ పాన్ కార్డ్ (PAN Card) ఉండటం తప్పనిసరి.
ఎంపికైన వారు నిబంధనల ప్రకారం కొంత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం తమకు సమీపంలోని పోస్ట్ ఆఫీసును గానీ లేదా సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయాన్ని గానీ సంప్రదించవచ్చు. ప్రభుత్వ గుర్తింపుతో సొంతంగా ఎదగాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం.
తాజావార్తలు
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్‌డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?