Site icon NTV Telugu

GST: జీఎస్టీకి ముందు.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వస్తువులు యూరప్ మీదుగా పంపాల్సి వచ్చేదా..?

Gst

Gst

GST: జీఎస్టీ అమలుకు ముందు భారతదేశ పన్ను వ్యవస్థ ఎలా ఉండేదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం వెలుగులోకి తెచ్చారు. గతంలో వ్యాపారాలు డజన్ల కొద్దీ పన్నులు చెల్లించి లెక్కలేనన్ని ఫారమ్‌లను పూరించాల్సి వచ్చేదన్నారు. పరిస్థితి చాలా కష్టంగా ఉండేదని తెలిపారు.. కంపెనీలు వస్తువులను విదేశాలకు పంపించి, తిరిగి మన దేశానికే దిగుమతి చేసుకునేవి అని వివరించారు. అయితే.. ప్రధాని మోడీ ఉదహరించిన సంఘటన ఫ్రెంచ్ వార్తాపత్రిక లెస్ ఎకోస్‌లో ప్రచురించబడింది. 2014 నివేదిక ప్రకారం.. భారతదేశంలో పనిచేస్తున్న ఒక ఫ్రెంచ్ టెక్నాలజీ కంపెనీ బెంగళూరు నుంచి తన వస్తువులను హైదరాబాద్‌కు పంపాలంటే ముందుగా యూరప్‌కి పంపేది. అక్కడి నుంచి హైదరాబాద్‌కి దిగుమతి చేసుకునేది. ఈ రెండు భారతీయ నగరాలు కేవలం 570 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఇతర దేశమైన యూరప్‌కి పంపడం ఆ కంపెనీకి సులభంగా, చౌకగా మారేది. ఎందుకు కంటే.. బెంగళూరు, హైదరాబాద్ మధ్య అనేక రాష్ట్ర సరిహద్దులు, టోల్ ప్లాజాలు, చెక్‌పోస్టుల వద్ద సమయం, ఖర్చులు వృథా అవుతున్నాయని గమనించిన కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

READ MORE: GST 2.0 : మోడీ దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని పిలుపు, జీఎస్టీ 2.0తో ద్విగుణ ప్రయోజనం.. నవరాత్రి నుంచి స్వదేశీ వైభవం

నాడు పన్నులు, డాక్యుమెంట్‌ పనులు కంపెనీలకు చికాకు తెప్పించేవి. ప్రవేశ పన్ను, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, సేవా పన్ను, వ్యాట్ వంటి అనేక పన్నులు ఉండేవి. ఈ పన్నుల వల్ల ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వస్తువులను రవాణా చేయడం చాలా కష్టంగా ఉండేది. పదులు సంఖ్యలో ఫారమ్‌లను పూరించాల్సి వచ్చేది. చెక్‌పోస్టులు, పన్ను వసూలు పాయింట్ల వద్ద రోడ్‌బ్లాక్స్ అయ్యేవి. ఇవి వ్యాపారులకు ప్రధాన సమస్యగా మారాయి. అంతే కాకుండా.. సమయంతోపాటు ఖర్చులనూ పెంచింది. ప్రస్తుతం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఈ బాధలన్నీ తప్పాయని ప్రధాని మోడీ తన ప్రసంగంలో వివరించారు. “ఒక దేశం, ఒక పన్ను” అనే కల నెరవేరిందని.. దేశవ్యాప్తంగా పన్ను వ్యవస్థ ఇప్పుడు సరళంగా మారిందన్నారు. ఇది వ్యాపారాలకు ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు. భారతదేశ వ్యాపార వ్యవస్థ గతంలో కంటే మరింత పారదర్శకంగా, సరళంగా మారిందని వివరించారు.

READ MORE: Iga Swiatek: Korea Open 2025 విజేతగా ‘ఇగా స్వియాటెక్’

Exit mobile version