Site icon NTV Telugu

Upi Payments: ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్ చెయ్యొచ్చు.. ఎలాగంటే?

Upi

Upi

ఈ మధ్య ప్రతి ఒక్కరు క్యాష్ పేమెంట్స్ చెయ్యడం లేదు.. కేవలం యూపిఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.. కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇవ్వడంతో ఎక్కువమంది ఇలానే పేమెంట్స్ చేస్తున్నారు..గల్లీలో ఉండే కిల్లీ కొట్టు నుంచి పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకు చెల్లింపులు అన్నీ డిజిటల్‌ పద్ధతితోనే జరుగుతున్నాయి.. ఇక నెట్ ఉండటం వల్ల పేమెంట్స్ క్షణాల్లో అవుతుంటాయి.. కానీ సార్లు నెట్ స్లో గా ఉండటం వల్ల పేమెంట్స్ ఆగిపోతాయి..

మన ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోవడం, లేదా.. బ్యాంకులో టెక్నికల్‌ సమస్యలు. ఈ రెండు కారణాలతోనే యూపిఐ చెల్లింపులు చేయలేకపోతాం.. బ్యాంక్ సంబందించిన సమస్యలు అయితే మన చేతుల్లో ఉండవు కానీ ఇంటర్నెట్ సమస్యలు అయితే మన చేతుల్లో ఉంటాయి.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. నెట్ లేకపోయిన పేమెంట్స్ చేసుకోవచ్చునని చెబుతున్నారు.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా యూపీఐ పేమెంట్స్‌ చేయాలంటే.. 080 4516 3666 లేదా 6366 200 200 లేదా 080 4516 3581 ఈ నంబర్లలో ఏదో ఒక నంబర్‌కు రిజిస్టర్‌ ఫోన్‌ నంబర్‌ అంటే యూపీఐ నెంబర్ నుంచి కాల్‌ చేయాలి.. ఆ తర్వాత మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా యూపీఐ ద్వారా డబ్బులు పే చేయవచ్చు అని.. ఆ తర్వాత మీరు షాప్ ఓనర్ నెంబర్ తీసుకొని అతని అమౌంట్ ను చెల్లించవచ్చు..అంతే నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా యూపీఐ ద్వారా మీ ఖాతాలోని డబ్బులు షాప్‌ కీపర్‌ ఖాతాకు ట్రాన్స్ఫర్ అవుతాయి.. ఇంతే చాలా సింపుల్ కదా ట్రై చెయ్యండి..

Exit mobile version