Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ott Market Is Expected To Reach Rs 12000 Crore By 2023

OTT: రూ.12,000 కోట్లకు చేరనున్న ఓటీటీ మార్కెట్.. థియేటర్లకు ఇక కష్టకాలమే..

Published Date :August 28, 2022 , 12:07 pm
By Venu Goapl Reddy
OTT:  రూ.12,000 కోట్లకు చేరనున్న ఓటీటీ మార్కెట్.. థియేటర్లకు ఇక కష్టకాలమే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

The growing OTT market is expected to reach Rs.12,000 crore by 2023: ఇండియాలో ఓవర్ – ది- టాప్(ఓటీటీ) వ్యాపారం విస్తరిస్తోంది. ఎస్బీఐ రిసెర్చ్ ప్రకారం 2023 నాటికి ఓటీటీ మార్కెట్ రూ. 11,944 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. 2018లో రూ.2590 కోట్లుగా ఉన్న ఓటీటీ వ్యాపారం ఐదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. 36 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయాల్లో ప్రజలు ఎక్కువగా ఓటీటీలకు చేరువయ్యారు. 2000 ప్రారంభంలో మల్లీప్లెక్సులు వీసీఆర్/ వీసీడీ బిజినెస్ ను ఎలా దెబ్బతీశాయో.. ప్రస్తుతం ఓటీటీలు, థియేటర్ వ్యాపారాన్ని అలా దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఓటీటీ వినోద పరిశ్రమ వాటా, రాబడిలో 7-9 శాతాన్ని ఆక్రమించింది. ఓటీటీ అన్ని భాషల్లో కంటెంట్ అందిస్తుండటంతో ప్రేక్షకులు వీటికి దగ్గర అవుతున్నారు. అరచేతుల్లో వినోద పరిశ్రమ ఉండటంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తక్కువ అవుతోంది. కంటెంట్ ఉన్న సినిమా వస్తే కానీ థియేటర్ల వైపు వెళ్లడం లేదు జనాలు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతిఘోష్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం 45 కోట్ల మంది ఓటీటీ సబ్‌స్క్రైబర్లు ఉన్నారని.. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని.. 2023 నాటికి ఓటీటీ సబ్‌స్క్రైబర్లు సంఖ్య 50 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.

Read Also: Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి ఇవ్వండి

ఇంటర్నెట్ వేగం పెరగడమూ కారణమే..

ఓటీటీ ఎదుగుదలకు ఇంటర్నెట్ వేగం కూడా ఓ కారణం అవుతుంది. మొబైల్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు కావడం కూడా ఓటీటీ వ్యాపారానికి కలిసి వస్తోంది. ప్రస్తుతం దేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో 4-జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇంటర్నెట్ వేగం పెరిగింది. రానున్న కాలంలో 5-జీ కూడా అందుబాటులోకి వస్తోంది.

ప్రస్తుతం డిస్నీ హాట్‌స్టార్ కి 14 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లు, అమెజాన్ ప్రైమ్ కి 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు, నెట్ ఫ్లిక్స్ కి 4 కోట్లు మంది, జీ 5కి 3.7 కోట్లు మంది, సోనీ లివ్ కి 2.5 కోట్లు మంది ఖాతాదారులు ఉన్నారు. తక్కువ ధరలకు సేవలన్ని అందిస్తుండటంతో వీటికి ఖాతాదారులు పెరుగుతున్నారు. యూఎస్ తో పోలిస్తే 70-90 శాతం కన్నా చౌకగా ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో సబ్‌స్క్రైబర్‌లు పెరుగుతున్నారు.

50 శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు నెలకు 5 గంటల కన్నా ఎక్కువ సమయం ఓటీటీలను ఉపయోగిస్తున్నారని.. దీంతో థియేటర్ లాభాలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీల కోసమే కంటెంట్ సిద్ధం చేస్తున్నారు. వెబ్ సిరీస్ లు, సినిమాలను ఓటీటీల్లోకి తేస్తుండటంతో ఇదే లాభసాటి మార్గమని చాలా మంది గ్రహించారు. సంప్రదాయక ఫిల్మ్ మేకింగ్ కన్నా ఓటీటీలే లాభదాయకం అని గ్రహించిన స్టూడియోలు ప్రత్యేకించి సొంత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. రాబోయే కాలంలో విద్య, హెల్త్, ఫిట్ నెస్ వంటివి కూడా ఓటీటీల్లో విస్తరించే అవకాశం ఉంది. దీంతో మరింగా జనాల్లోకి ఓటీటీలు ప్రవేశించే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon Prime Video
  • Disney Hotstar
  • OTT
  • OTT Impact on theater business
  • OTT market growing

తాజావార్తలు

  • Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

  • CM Chandrababu Serious Warning: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్.. కీలక సమాచారం ఎలా లీక్‌ అయ్యింది..?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions