ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు సొంత వాహనం అవసరమే లేదు.. నచ్చిన రైడ్ యాప్‌ను మొబైల్‌లో డౌలేడ్ చేసుకుని.. బైక్, ఆటో, కారు.. ఇలా ఏది బుక్ చేసుకున్నా.. మీరు ఉన్నచోటికే వచ్చి పికప్ చేసుకుని.. గమ్యస్థానానికి చేర్చుతున్నాయి.. క్రమంగా.. ఉబెర్, ఓలా, రాపిడో.. వంటి యాప్స్ తెగ వాడేస్తూ.. గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.. ఇది ముఖ్యంగా సిటీలో ఎక్కువగా జరుగుతోంది.. అయితే, ఈ యాప్స్ ఎక్కువగా వాడుతుంటే మాత్రం.. ఇప్పటికే మీ సమాచారం మొత్తం వారి గుప్పిట్లో ఉన్నట్టే.. సైబర్ సెక్యూరిటీ కంపెనీ సర్ఫ్ షార్క్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయాలు వెలుగుచూశాయి..
Read Also: శుభవార్త.. భారీగా తగ్గనున్న వ్యాక్సిన్ ధరలు..!
ఆ స్టడీ ప్రకారం.. ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్-హైలింగ్ యాప్స్ తమ వినియోగదారులకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయని తేల్చింది.. ఇక, ఆ డేటాను తృతీయపక్ష ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారు. గ్రాబ్ టాక్సీ, యాండెక్స్ గో, ఉబెర్ కంపెనీల యాప్స్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ డేటా సేకరిస్తున్న టాక్సీ యాప్స్‌గా తేల్చింది. ఇక, కస్టమర్ల నుంచి సేకరిస్తున్న పరంగా దేశీయంగా చూస్తే.. రైడ్-షేరింగ్ యాప్ ఓలా 6వ స్థానంలో ఉంది.. రాపిడో ప్రముఖ గ్రాబ్ టాక్సీ యాప్ కంటే దాదాపు పది రెట్లు తక్కువ డేటాను సేకరిస్తుంది. కస్టమర్లకు సేవలు అందించడానికి యూజర్ పేరు, ఫోన్ నంబర్, స్థానాన్ని మాత్రమే సేకరిస్తున్నట్టు ఆ స్టడీలో తేలింది.. ముఖ్యంగా మూడు అంశాల ఆధారంగా డేటా సేకరిస్తున్నట్లు సర్ఫ్ షార్క్ పేర్కొంది.. గ్రాబ్ టాక్సీ కాంటాక్ట్, ఫైనాన్షియల్, లొకేషన్ సమాచారం, యూజర్ కంటెంట్ వంటి వివరాలు కూడా సేకరస్తున్నట్లు వెల్లడించింది.. ఉబెర్ 7వ స్థానంలో ఉండగా.. జాతి, జాతి, లైంగిక దృక్పథం, గర్భధారణ, ప్రసవ సమాచారం, బయోమెట్రిక్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించే ఏకైక రైడ్-హైలింగ్ యాప్ గా లిఫ్ట్ లినిచినట్టు ఆ అధ్యయనం స్పష్టం చేసింది.. అధ్యయనం యొక్క ఫలితాలపై మాట్లాడిన సర్ఫ్‌షార్క్ సీఈవో వైటౌటాస్ కజియుకోనిస్.. ఈ రోజు చాలా మంది వ్యక్తులు సౌకర్యం కోసం గోప్యతను వ్యాపారం చేయడానికి, సేవకు బదులుగా వారి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అలా చేయడం ద్వారా, ప్రజలు వారితో సహా వారు వెళ్లే ప్రతిచోటా వారి డిజిటల్ ఆనవాళ్లను వదిలివేస్తారని… వ్యక్తిగత వివరాలు, భౌతిక చిరునామాలు మరియు వారు క్లిక్ చేసిన లింక్‌లు కూడా తెలిసిపోతాయని పేర్కొన్నారు.
