75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నది. రూ.499 చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అత్యధికంగా అడ్వాన్డ్స్ బుకింగ్ జరిగిన స్కూటర్‌గా ఓలా రికార్డ్ సాధించింది. ఇక ఓలా స్కూటర్ ప్రత్యేకతల గురించి ఆ కంపెనీ ప్రతిరోజూ ప్రచారం చేస్తే వస్తుండటంతో ఆసక్తి నెలకొన్నది. ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ పేర్కొన్నది. 0 నుంచి 50 శాతం బ్యాటరీ చార్జింగ్ కావడానికి 18 నిమిషాల సమయం పడుతుందని పేర్కొన్నది కంపెనీ. ఇందులో రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఇస్తున్నట్టు ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. వివిధ రకాల ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న ఈ ఓలా స్కూటీలు విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.
Read: మళ్ళీ మొదలైంది : మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్
