75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓలా కంపెనీ దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్‌ను ఇండియాలో నెలకొల్పి ఉత్పత్తిని ప్రారంభించింది. కాగా, ఇప్పుడు ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నది. దీనికి సంబంధించిన ఫొటోను ఓలా కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎలక్ట్రిక్ కారు డిజైన్ నిస్సాన్ లీఫ్ ఈవీ కారు మోడల్ మాదిరిగా ఉండటంతో పాటు, అటు స్మాల్ హ్యచ్‌బ్యాక్‌తో టెస్లా మోడల్ 3 లాగా ఓలా ఎలక్ట్రిక్ కారు డిజైన్ ఉంది.
Read: అవినీతి రహిత దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?
ఓలా ఎలక్ట్రిక్ కారు కాంపాక్ట్ క్యాబిన్‌తో వస్తుందని తెలుస్తోంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారును 2023లో లాంచ్ చేస్తారని తెలుస్తుంది. దీని ధర ఎంత, ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఇండియాలో ఎక్కడ దీనిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని ఓలా ఇండియా సీఈవో ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
