NTV Telugu Site icon

New Income Tax Slabs: కొత్త ఆదాయపన్ను శ్లాబులు ఇవే.. ఇంత ఆదాయం ఉన్నవారికి బిగ్ రిలీఫ్!

Income

Income

యూనియన్ బడ్జెట్ 2025-26 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో అందరి దృష్టి ఆదాయపన్నుపైనే ఉంది. ఇన్ కం ట్యాక్స్ ఎంత విధిస్తారు? కొత్త పన్ను శ్లాబులు ఎలా ఉంటాయి? అని చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను శ్లాబులను ప్రకటించింది. మధ్య తరగతి ప్రజలకు బిగ్ రిలీఫ్ ను ఇచ్చింది. ఇప్పటి వరకు రూ. 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపన్ను నుంచి మినహాయించబడ్డారు. కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆదాయ పన్ను శ్లాబులు, ఆదాయ పన్ను రేట్లలో మార్పులు చేయాలని బడ్జెట్ లో ప్రభుత్వం ప్రతిపాదించింది. నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను శ్లాబులను ప్రకటించారు. రూ. 4 లక్షల ఆదాయంపై జీరో ట్యాక్స్, రూ. 8 లక్షల ఆదాయంపై 5శాతం, రూ. 8 నుంచి 12 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ. 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15 శాతం ట్యాక్స్ విధించనున్నారు. 16-20 లక్షల ఆదాయంపై 20 శాతం, 20-24 లక్షల ఆదాయంపై 25 శాతం, 24 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ ఉండనున్నది.