NTV Telugu Site icon

Stock market: జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన నిఫ్టీ

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇక నిఫ్టీ మరోసారి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. బుధవారం 25,052 మార్కును క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ ఫలితాలతో మన మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైన.. అనంతరం క్రమక్రమంగా లాభాల్లోకి వచ్చేసింది. సెన్సెక్స్ 73 పాయిట్లు లాభపడి 81, 785 దగ్గర ముగియగా.. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 25, 052 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.92 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Vikram: బ్లాక్ బస్టర్ తంగలాన్.. టీం అందరికీ స్వయంగా బిర్యానీ వడ్డించిన విక్రమ్

నిఫ్టీలో ఎల్‌టిఐఎండ్‌ట్రీ, విప్రో, దివిస్ ల్యాబ్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మరియు భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా లాభపడగా… మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మరియు బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టపోయాయి. రంగాల్లో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌లు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరిగాయి.

ఇది కూడా చదవండి: Draupadi Murmu: వైద్యురాలి అత్యాచార ఘటనపై తొలిసారిగా స్పందించిన రాష్ట్రపతి