New Model Cars: ఏప్రిల్ నెలలో విడుదల కాబోయే కొత్త కార్లు ఇవే..
- ఏప్రిల్ నెలలో కొత్త కొత్తగా..
- కొత్త మోడళ్లతో తళుక్కుమననున్న కార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. కారు అనేది ప్రయాణ సాధనం మాత్రమే కాకుండా.. నేడు అదొక హోదాకు, సౌకర్యానికి చిహ్నంగా మారింది. అందుకే మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తుందంటే చాలు.. వాహన ప్రియుల్లో ఎంతో ఆసక్తి నెలకొంటుంది. కారు మైలేజీ ఎంత? అందులో ఉన్న అధునాతన ఫీచర్లు ఏమిటి? భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అన్నింటికీ మించి మన బడ్జెట్‌కు అందుబాటులో ఉంటుందా లేదా అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి లగ్జరీ కార్లను ఇష్టపడే వారి వరకు అందరూ తమ ఇష్టాలకు తగ్గట్టుగా మార్కెట్‌ను గమనిస్తూ ఉంటారు. 2026 మార్చి నెల ఇప్పటికే పలు కీలక లాంచీలతో సందడి చేయగా, ఏప్రిల్ నెల అంతకు మించిన అప్‌డేట్స్‌తో రాబోతోంది.
ఎస్‌యూవీల హవా కొనసాగుతుండగానే, ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. పాత మోడళ్లకు కొత్త హంగులు అద్దడంతో పాటు, పూర్తిగా సరికొత్త బ్రాండ్లను కూడా కంపెనీలు భారత్‌కు పరిచయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన కొనుగోలుదారులకు ఎంపిక చేసుకునేందుకు బోలెడన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Vande Bharat Freight Train: భారతీయ రైల్వేలో కొత్త అధ్యాయం.. వందే భారత్ తొలి గూడ్స్ రైలు ట్రయల్స్ ప్రారంభం
- Bank Holidays August 2026: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టులో సగం రోజులు సెలవులే..!
ఏప్రిల్ నెలలో రాబోతున్న కార్ల విషయానికి వస్తే.. వోక్స్‌వ్యాగన్ తన పాపులర్ మోడల్ టైగూన్‌ను మరింత స్టైలిష్‌గా ముస్తాబు చేసి ఏప్రిల్ 9న విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిలో లోగో, కనెక్టెడ్ లైట్లు వంటి కొత్త ఫీచర్లు ఉండబోతున్నాయి. అలాగే ఎమ్‌జీ మోటార్స్ తన గ్లోస్టర్ స్థానంలో ‘మెజెస్టర్’ అనే భారీ ఎస్‌యూవీని లాంచ్ చేస్తోంది. ఇది చూడటానికి చాలా గంభీరంగా ఉండటమే కాకుండా శక్తివంతమైన ఇంజిన్‌తో టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లకు సవాల్ విసరనుంది.
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టయోటా కంపెనీ తన తొలి ఈవీ ‘ఎబెల్లా’ను భారత మార్కెట్లోకి తెస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఏప్రిల్ 24న సీఎల్ఏ ఈవీని లాంచ్ చేస్తోంది. దీని రేంజ్ ఏకంగా 792 కిలోమీటర్లు ఉంటుందని సమాచారం.
మార్చి నెలలో స్కోడా కుషాక్, రెనాల్ట్ డస్టర్ వంటి కార్లు ఇప్పటికే సందడి చేశాయి. హ్యుందాయ్, టాటా కంపెనీలు కూడా తమ మోడళ్లను అప్‌డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఏప్రిల్ నెల ఒక మంచి అవకాశంగా మారనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!