NTV Telugu Site icon

Netflix Games: నెట్‌ఫ్లిక్స్‌ ‘ఆటలు’ సాగట్లేదు. కనీసం ఒక్క శాతం మంది అయినా చూస్తే ఒట్టు.

Netflix Games

Netflix Games

Netflix Games: వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ ప్రారంభించిన గేమింగ్‌ బిజినెస్‌ నత్తనడకన సాగుతోంది. 99 శాతం మంది సబ్‌స్క్రైబర్లు అసలు ఆ ఆటల జోలికే వెళ్లట్లేదని లేటెస్ట్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌లో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 221 మిలియన్లు కాగా అందులో 1 శాతం కన్నా లోపే అంటే 1.7 మిలియన్ల మంది మాత్రమే గేమ్స్‌ ఆడుతున్నట్లు యాప్‌ అనలిటిక్స్‌ కంపెనీ యాప్‌టోపియా తెలిపింది.

ఫార్మా ప్లాన్లు

ఇండియన్‌ ఫార్మా ఇండస్ట్రీ ఫ్యూచర్‌ ప్లాన్లు రచిస్తోంది. 2030 నాటికి టాప్‌-10 దేశాల జాబితాలో చోటు దక్కించుకోవటంపై ఫోకస్‌ పెట్టింది. 2047 నాటికి టాప్‌-5లోకి ఎదగాలని ఆశిస్తోంది. 1970ల్లో సుమారు 650 కోట్ల రూపాయలుగా ఉన్న మన ఫార్మా రంగం మార్కెట్‌ వ్యాల్యూ ఇప్పుడు ఏకంగా 1.67 ట్రిలియన్‌ రూపాయలకు చేరటం విశేషం. 90 శాతానికి పైగా మందులు స్థానికంగానే ఉత్పత్తి అవుతున్నాయి.

‘బ్రిటిష్‌’ క్లోజ్‌

మన దేశం మరో 5 రోజుల్లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్‌ ఇండియా కార్పొరేషన్‌ని మూసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థను బ్రిటిష్‌ ఎంట్రప్రెన్యూర్‌ సర్‌ అలెగ్జాండర్‌ మ్యాక్‌రాబర్ట్‌ 1920లో స్థాపించాడు. ఈ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ.. ధరివాల్‌, లాల్‌-ఇమ్లి అనే బ్రాండ్‌ నేమ్స్‌తో ఉన్ని ఉత్పత్తులను తయారుచేసేది. ఈ ప్రొడక్టులు ఒకప్పుడు బాగా ఫేమస్‌. ప్రతి ఇంట్లోనూ వాడేవాళ్లు.

‘ఇథనాల్‌’ స్టార్ట్‌

సెకండ్‌ జనరేషన్‌ వనరుల నుంచి ముఖ్యంగా వ్యవసాయ వ్యర్థాలతో ఇథనాల్‌ ఉత్పత్తికి ఇండియా ఇవాళ శ్రీకారం చుట్టనుంది. 900 కోట్ల రూపాయలతో హర్యానాలోని పానిపట్‌లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నిర్మించిన ప్లాంట్‌ ప్రారంభంకానుంది. 2016-17లో ప్రభుత్వ చమురు సంస్థలు 10 వేల కోట్లతో 12 ప్లాంట్లను ప్లాన్‌ చేశాయి. కానీ అవి పలు దశల్లో ఆగిపోయాయి. ఈ క్రమంలో ఇది తొలి ప్లాంట్‌. అయితే ఇథనాల్‌ ఉత్పత్తికి మరింత టైం పట్టొచ్చని తెలుస్తోంది.

9% లాభం

12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో 9 శాతానికి పైగా లాభాలను ఆర్జించాయి. మొత్తం 15,306 కోట్ల రూపాయల ప్రాఫిట్స్‌ని నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 14,013 కోట్ల రూపాయల లాభాలను పొందాయి. ఈ 12 బ్యాంకుల్లో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓఐ మాత్రం తమ లాభాలు 7 నుంచి 70 శాతం వరకు పడిపోయినట్లు వెల్లడించాయి.

ఇటలీకి బైబై

2015లో ఇటలీలో అడుగుపెట్టిన డోమినోస్‌ సంస్థ ఆ దేశానికి గుబ్‌బై చెప్పింది. ఇ-పిజ్జా స్పాతో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకొని ఈ ఏడేళ్లూ బాగానే రాణించినప్పటికీ ఇటీవల గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇటలీ ప్రజలు లోకల్‌ రెస్టారెంట్ల వైపు మొగ్గు చూపటం మొదలుపెట్టారు. దీనికితోడు నష్టాలు పెరిగిపోయాయి. దీంతో డోమినోస్‌ తన 29 బ్రాంచ్‌లను మూసేసింది.