Site icon NTV Telugu

Reliance Jio IPO: స్టాక్ మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న ముఖేష్ అంబానీ ..

Mukesh Ambani

Mukesh Ambani

Reliance Jio IPO: రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ 2026 క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగం నాటికి తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది. రిలయన్స్ AGMలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ జూన్ 2026 నాటికి రిలయన్స్ జియోను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయాలనే ప్రణాళికలను ప్రకటించారు. వివిధ పెట్టుబడి బ్యాంకుల నివేదికల ప్రకారం.. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌ల అంచనా విలువ $130 బిలియన్ల నుంచి $170 బిలియన్ల మధ్య ఉండవచ్చు.

READ ALSO: MLA Malla Reddy : సంక్రాంతి సంబరాల్లో ముగ్గు వేసిన మల్లారెడ్డి..

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. రిలయన్స్ గ్రూప్ కంపెనీ తన వాటాలో 2.50% విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని అర్థం రిలయన్స్ జియో IPO పరిమాణం దాదాపు $4 బిలియన్లు ఉండవచ్చు. ఇది భారత ప్రాథమిక మార్కెట్ చరిత్రలో అతిపెద్ద IPOగా మారుతుందని సమాచారం. ఆగస్టు 2025లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జియో IPO కోసం అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని స్పష్టంగా పేర్కొన్నారు. సెబీ నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత, 2026 మొదటి అర్ధభాగంలో జియోను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు. అందువల్ల రిలయన్స్ జియో IPO జూన్ 2026 నాటికి జరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బిగుల్ నివేదికల ప్రకారం.. రిలయన్స్ జియో IPO కోసం గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ప్రస్తుతం ఒక్కో షేరుకు ₹93 వద్ద ఉంది. దీని అర్థం DRHP దాఖలు చేయడానికి ముందే కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. పైన చెప్పినట్లుగా జియో ప్లాట్‌ఫామ్‌లలో రిలయన్స్ గ్రూప్ తన 2.50% వాటాను విక్రయించవచ్చని రాయిటర్స్ పేర్కొంది. రిలయన్స్ జియో IPO పరిమాణం సుమారు $4 బిలియన్లు ఉంటుందని ఇది స్పష్టంగా సూచిస్తుంది. ఇది జరిగితే ఇప్పటివరకు భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ అవుతుంది. ప్రస్తుతం ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం వెయిట్ చేస్తుంది.

రిలయన్స్ జియో IPO ధరపై బొనాంజా రీసెర్చ్ అనలిస్ట్ అభినవ్ తివారీ మాట్లాడుతూ.. ప్రకటించిన వాల్యుయేషన్ $130 బిలియన్ – $170 బిలియన్ల మధ్య ఉంటే, రిటైల్ పెట్టుబడిదారులు 15% నుంచి 20% తగ్గింపును పొందినట్లయితే, రిటైల్ పెట్టుబడిదారులకు అంచనా వేసిన రిలయన్స్ జియో IPO షేరు ధర ఒక్కో షేరుకు ₹1,048 – ₹1,457 మధ్య ఉండవచ్చు. ఇది తుది వాల్యుయేషన్‌ను బట్టి ఉంటుంది.

రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫరీస్ నవంబర్ 2025లో రిలయన్స్ జియో వాల్యుయేషన్‌ను దాదాపు $180 బిలియన్లుగా అంచనా. ఈ వాల్యుయేషన్ ప్రకారం 2.5% వాటా అమ్మకం ద్వారా దాదాపు $4.5 బిలియన్లు సమీకరించవచ్చు. ఇది 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా $3.3 బిలియన్ల IPO ను మించిపోయింది. అయితే అనేక ఇతర పెట్టుబడి బ్యాంకులు రిలయన్స్ జియో వాల్యుయేషన్ $130 బిలియన్ల నుంచి $170 బిలియన్ల మధ్య ఉండవచ్చని నమ్ముతున్నాయి. జియో లిస్టింగ్ రాబోయే సంవత్సరాల్లో భారతదేశ IPO మార్కెట్‌ను గణనీయంగా పెంచుతుందని సమాచారం.

READ ALSO: Couple Relationship: భార్యాభర్తల మధ్య దూరానికి కారణం అయ్యే విషయాలు ఇవే..

Exit mobile version