నేటి సమాజంలో స్మార్ట్‌ఫోన్ లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ కరోనా మహమ్మారి పుణ్యమాఅని ఇప్పుడు పిల్లల ఆన్‌లైన్ క్లాసులు కూడా స్మార్ట్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. అయితే ఫోన్ కొందామనుకునే వారికి అందుబాటులో, వారి బడ్జెట్‌లో అన్ని ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కోసం తెగ వెతుకుతుంటారు. ఈ క్రమంలో మోటోరొలా వినియోగదారుల ముందు ఓ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చందుకు అడుగులు వేస్తోంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా మోటో జీ22ను కంపెనీ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లాంఛ్‌కు ముందే స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ ప్లిఫ్‌కార్ట్‌లో లిస్ట్ అవడం విశేషం.
మోటో జీ22 మీడియాటెక్ హెలియో జీ37 ప్రాసెసర్, 6.6 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాడ్ కెమెరా సెటప్ వంటి పలు ఫీచర్లతో వినియోగదారుడిని కట్టిపడేసేలా ఉంది. ఈ స్మార్ట్‌పోన్ ఐఫోన్ తరహా ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ కలిగి ఉండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఇక మోటొరోలా ప్రస్తుతం మోటో జీ22 లాంఛ్ డేట్‌ను వెల్లడించినప్పటికీ ధర గురించి తెలపకపోవడం గమనార్హం. మోటో జీ22 భారత్‌లో రూ 14,999 వరకూ అందుబాటులో ఉండే అవకాశం ఉందని టాప్ సెల్లర్స్ భావిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 8న మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు మోటరొలా ప్రకటించింది.
