నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను ఇంకొకరు వాడుకుంటరు. మీ తెలివి, శ్రమ మరొకరికి పెట్టుబడిగా మారుతాయి. కాబట్టి మీ ఆలోచనలను పెట్టుబడికి మార్గాలుగా మలుచుకోవాలి. ఒక చిన్న ఆలోచన మీ స్టేటస్ ను మార్చేస్తుంది. డబ్బు సంపాదనపై దృష్టిపెట్టాలి. సంపద క్రియేట్ చేయాలంటే ఒక్క బిజినెస్ తోనే సాధ్యం. స్వయం ఉపాధి పొందాలన్నా, నలుగురికి ఉపాధి కల్పించాలన్నా వ్యాపారమే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ పెట్టుబడితో ప్రతి రోజు ఆదాయం పొందే వ్యాపారాల కోసం చూస్తున్నారా? అయితే మీకోసం లాభాలను అందించే వ్యాపారం అందుబాటులో ఉంది. అదే మొలకల బిజినెస్.
ఈ వ్యాపారంతో రోజుకు కేవలం 3 గంటలు కేటాయిస్తే చాలు వేలల్లో సంపాదించుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో అంతా ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంటూ నేచురల్ ఆహార ఉత్పత్తులకు జై కొడుతున్నారు. తాజా పండ్లు, మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. కాగా చాలా మంది ఉదయం వేళ మొలకలు తినడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. పెసర్లు, శనగలు, పల్లీలు, సోయాబీన్, బఠానీ ఇలా పలు రకాల మొలకెత్తిన విత్తనాలను తీసుకుంటున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చిరు ధాన్యాలను తెచ్చుకుని వాటిని నాన బెట్టుకునేంత సమయం దొరకడం లేదు. ఇలాంటి తరుణంలో మొలకల బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు తిరుగుండదు. తక్కువ పెట్టుబడితో వేలల్లో ఆదాయం అందుకోవచ్చు. రక రకాల విత్తనాలను తీసుకొచ్చి వాటిని మొలకెత్తించి విక్రయించొచ్చు. చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుని అమ్ముకోవచ్చు. ఉదయం వేళ పార్కులు, యోగా సెంటర్లు, ఫిట్ నెస్ సెంటర్ల వద్ద ఈ బిజినెస్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్లేస్ లలో, జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మొలకల వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు.
రోజుకు 1500 నుంచి రూ. 2 వేల వరకు ఆదాయం పొందొచ్చు. ఒక ప్లేట్ మొలకలను రూ. 20 చొప్పున విక్రయిస్తే రోజులో 75 నుంచి 100 ప్లేట్స్ అమ్ముడైతే రూ. 2 వేల ఆదాయం వస్తుంది. అంటే మీరు నెలకు రూ. 45 నుంచి 60 వేల వరకు సంపాదించుకోవచ్చు. పెట్టుబడి ఖర్చులు తీసేసినా కనీసం 30 నుంచి రూ. 40 వేల వరకు లాభాలు అందుకోవచ్చు. మొలకల వ్యాపారాన్ని నష్టమే లేని బిజినెస్ గా చెప్పొచ్చు. మరి మీరు సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ బిజినెస్ ను ట్రై చేయండి.