NTV Telugu Site icon

Microsoft: జీతం పెరగకున్నా.. మీ ఆదాయాన్ని ఇలా పెంచుకోవచ్చు.. మైక్రోసాఫ్ట్ సీఎంఓ సూచన

Microsoft

Microsoft

Microsoft: ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఉద్యోగులను తీసేశాయి. మరికొన్ని సంస్థలు మాత్రం ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలు పెంచే పరిస్థితి లేదని చెబుతున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ఈ ఏడాది సాలరీ హైక్ ఉండదని చెప్పింది. దీనిపై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Dinesh Gope: మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అరెస్ట్.. తలపై రూ.30 లక్షల రివార్డ్..

ఇదిలా ఉంటే సాలరీ పెంచకున్నా.. ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఉందని చెబుతున్నాడు మైక్రోసాఫ్ట్ సీఎంఓ. వేతన పెంపు లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్(సీఎంఓ) క్రిస్టోఫర్ ఓ లేఖ రాసినట్లు ఫార్చూన్ పేపర్ పేర్కొంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం వెనక కారణాలను వివరించారు. అయితే ఆదాయం పెంచుకునే మార్గాలను కూడా అందులో సూచించారు. కంపెనీ స్టాక్ ధర పెరిగితే ఆటోమెటిక్ గా మీరు అందుకునే పరిహారం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ స్టాక్ ధర పెరిగేలా చేయాలని సూచించారు. మెరుగైన త్రైమాసిక ఫలితాలు సాధిస్తే.. స్టాక్ ధర పెరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ ఏడాది కంపెనీ షేర్ వాల్యూ 33 శాతం పెరిగినట్లు క్రిస్టోఫర్ తన లేఖలో వెల్లడించారు.

ఆర్థికంగా అస్థిర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగులకు వేతనాల పెంపు ఉండదని ఆ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల స్వయంగా వెల్లడించారు. అయితే బోనస్, స్టాక్ అవార్డులు మాత్రం కొనసాగుతాయన్నారు. మరో వైపు కంపెనీ ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ ఏడాది జనవరిలో 10,000 మందిని మైక్రోసాఫ్ట్ తొలగించింది.