జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. జనవరి 1, 2025 నుంచి పోర్ట్‌ఫోలియోలోని మొత్తం మోడల్ శ్రేణిపై భారతదేశంలో తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు శుక్రవారం తెలిపింది. ప్రస్తుతం స్టాక్‌లో లేని వాహనాలకు ఈ ధర సవరణ వర్తిస్తుందని తెలిపింది. కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Konda Visveshwar Reddy: ఖురాన్‌లో వక్ఫ్ ప్రస్తావన లేదు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ద్రవ్యోల్బణం, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా వ్యాపార కార్యకలాపాలపై భారీ ఒత్తిడి ఎదురవుతోందని తెలిపింది. గత మూడు త్రైమాసికాల నుంచి కంపెనీ నిర్వహణ వ్యయం పెరుగుతోందని.. దీంతో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. అయితే డిసెంబర్31 లోపు బుకింగ్ చేసుకునే వాహనాలకు ఈ పెంపు వర్తించదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం రూ.45 లక్షలు విలువైన ఏ క్లాస్ కార్ల నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు అనేక రకాల వాహనాలను దేశీయంగా విక్రయిస్తోంది.
ఇది కూడా చదవండి: Tollywood : ఘనంగా ప్రారంభమైన ‘మహా సంద్రం’