NTV Telugu Site icon

Mahindra: ఇక‌పై లీజుకు మ‌హీంద్రా కార్లు… ఎలా తీసుకోవ‌చ్చంటే…

కార్ల దిగ్గ‌జం మ‌హీంద్రా కంపెనీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. మ‌హీంద్రా కంపెనీకి చెందిన కార్ల‌ను లీజ్‌కు ఇచ్చేందుకు సిద్ద‌మైన‌ట్టు కంపెనీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. దీనికోసం క్విక్లిజ్‌తో ఒప్పందం చేసుకున్న‌ది. పే ప‌ర్ యూజ్ ప‌ద్ద‌తిని తెర‌మీద‌కు తీసుకొచ్చింది. పే ప‌ర్ యూజ్ సేవ‌ల‌ను ముంబై, పూణే, ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, చెన్నై త‌దిత‌ర న‌గ‌రాల్లో ఈ ప‌ద్ద‌తిని అమ‌లులోకి తీసుకొచ్చింది. మ‌హీంద్రా ఆటోపోర్ట‌ల్ లేదా డీల‌ర్‌షిప్ కార్యాల‌యానికి వెళ్లి లీజుకు సంబంధించిన విష‌యాల‌ను తెలుసుకొవ‌చ్చు.

Read: Bionic Eyes: శాస్త్ర‌వేత్త‌ల అద్భుత సృష్టి… మాన‌వ ట్ర‌య‌ల్స్ ప్రారంభం…

ఈ లీజ్ నెల‌కు రూ. 21 వేల‌తో ప్రారంభం అవుతుంది. ఇన్సూరెన్స్‌, మెయింటెనెన్స్, రోడ్ సేఫ్టీ అసిస్టెంట్ వంటివి ఇందులోనే ఇక్లూడ్ అవుతాయని మ‌హీంద్రా సంస్థ పేర్కొన్న‌ది. దీనికి ఎలాంటి డౌన్ పేమెంట్ అవ‌స‌రం లేద‌ని, 24 నెల‌ల నుంచి 60 నెల‌ల వ‌ర‌కు లీజ్‌కు తీసుకోవ‌చ్చ‌ని మ‌హీంద్రా సంస్థ తెలియ‌జేసింది. న‌చ్చిన వాహనాన్ని ఎంచుకొని లీజ్‌కు తీసుకొని, కాల‌ప‌రిమితి త‌రువాత తిరిగి వెన‌క్కి ఇచ్చివేయ‌వ‌చ్చు లేదా అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చ‌ని కంపెనీ తెలియ‌జేసింది.