Site icon NTV Telugu

Lic Super Plan : కేవలం రూ.500 పెట్టుబడి కోటి రూపాయలు మీ సొంతం..

Licc

Licc

ప్రభుత్వ భీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాల కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇందులో మీరు డిపాజిట్ చేసిన డబ్బు నుండి మంచి రాబడిని పొందుతారు.. ఆ పాలసీనే ఎల్‌ఐసీ కరోడ్‌పతి లైఫ్.. ఈ పాలసీలో మీరు డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మీకు చివరికి కోటి రూపాయలు పొందవచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పాలసీలో డిపాజిట్ చేయాల్సిన మొత్తం మీరు నెలకు సుమారు 15 వేల రూపాయలు అంటే రోజుకు 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. నెలకు రూ.15,000 డిపాజిట్ చేస్తూ 16 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి.. అంటే మీరు రూ.30 లక్షలను మొత్తంగా పెట్టుబడి పెట్టి ఒక కోటి రూపాయలను పొందవచ్చు..

అయితే పాలసీని 25 సంవత్సరాలు పాటు కొనసాగించాలి. అంటే 16 ఏళ్లు మీరు పెట్టుబడి పెడితే మీకు 9 ఏళ్ల వడ్డీని పొందవచ్చు.. 16 సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత మీరు 9 సంవత్సరాల పాటు మెచ్యూరిటీ కోసం వెయిట్ చెయ్యాలి. అంతేకాదు ఈ పాలసిని తీసుకున్న తర్వాత మీ కుటుంబానికి రక్షణ భీమా కూడా ఉంటుంది. రూ. 40 బీమా, రూ. 80 లక్షల వరకు ప్రమాద రక్షణ లభిస్తుంది.. ఏ ప్రమాదం జరిగిన కూడా మీకు చేతికి 80 లక్షలు మీ చేతికి వస్తాయి.. లోన్ పొందే అవకాశాలు ఉన్నాయి.. అలాగే పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..

Exit mobile version