LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- LIC సరళ్ పెన్షన్
- పాలసీ తీసుకునే సమయంలో ఒక్కసారే పెట్టుబడి పెట్టాలి
- ఆ తర్వాత పాలసీదారుడు జీవితాంతం నిర్ణీత మొత్తంలో పెన్షన్‌ను పొందుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగం చేస్తున్నంత కాలం నెల నెల శాలరీ వస్తుంది. కాబట్టి ఏ చింతా లేకుండా అవసరాలను తీర్చుకోవచ్చు. కానీ రిటైర్ అయ్యాక శాలరీ ఆగిపోతుంది. ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదురుకావొద్దంటే నెల నెలా కొంత మొత్తం వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం చాలా మంది క్రమమైన ఆదాయం వచ్చే పెట్టుబడి పథకాలను ఎంచుకుంటుంటారు. అలాంటి వారికోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అందిస్తున్న సరళ్ పెన్షన్ (Saral Pension) పథకం మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే, జీవితాంతం హామీతో కూడిన పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్
LIC సరళ్ పెన్షన్ అనేది సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్. అంటే పాలసీ తీసుకునే సమయంలో ఒక్కసారే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత పాలసీదారుడు జీవితాంతం నిర్ణీత మొత్తంలో పెన్షన్‌ను పొందుతారు. ఈ పథకం ముఖ్యంగా పదవీ విరమణ అనంతరం స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది IRDAI మార్గదర్శకాల ప్రకారం స్టాండర్డ్ ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్‌గా అందుబాటులో ఉంది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
పెన్షన్ మొత్తం జీవితాంతం ఒకేలా
సరళ్ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రారంభంలో నిర్ణయించిన పెన్షన్ మొత్తం జీవితాంతం మారదు. మార్కెట్ పరిస్థితులు లేదా ఇతర అంశాల ప్రభావం లేకుండా అదే మొత్తాన్ని నిరంతరం పొందవచ్చు.
ఎవరు తీసుకోవచ్చు?
కనీస వయసు: 40 సంవత్సరాలు (పూర్తి)
గరిష్ఠ వయసు: 80 సంవత్సరాలు (పూర్తి)
జాయింట్ లైఫ్ ఆప్షన్లో భాగస్వామి (స్పౌస్) వయసు కూడా ఈ పరిధిలో ఉండాలి.
మెడికల్ టెస్టులు సాధారణంగా అవసరం లేదు.
భార్యాభర్తలు కలిసి కూడా పాలసీ తీసుకోవచ్చు
ఈ పథకాన్ని వ్యక్తిగతంగా లేదా జాయింట్ లైఫ్ ఆప్షన్లో భార్యాభర్తలు కలిసి తీసుకోవచ్చు. జాయింట్ పాలసీ సందర్భంలో ఒకరు మరణించినా, మరొకరికి పెన్షన్ కొనసాగుతుంది. ఈ పథకంలో ప్రవేశ వయస్సు 40 నుంచి 80 సంవత్సరాల మధ్య ఉంటుంది.
సరెండర్, రుణ సౌకర్యం
పాలసీ ప్రారంభమైన ఆరు నెలల తర్వాత కొన్ని షరతులకు లోబడి పాలసీని సరెండర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. పాలసీదారుడు మరణించిన తర్వాత నామినీకి పెట్టుబడి పెట్టిన అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడం ఈ పథకంలోని ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి.
పెన్షన్ చెల్లింపు విధానాలు
LIC సరళ్ పెన్షన్ పథకం కింద పెన్షన్‌ను నెలవారీ, త్రైమాసికం, అర్ధవార్షికం, వార్షికంగా పొందవచ్చు. ఈ పథకంలో కనీస వార్షిక పెన్షన్ రూ.12,000 నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు.
కనీస పెన్షన్ మొత్తాలు (Annuity Modes)
నెలవారీ: రూ.1,000
త్రైమాసికం: రూ.3,000
అర్ధ వార్షికం: రూ.6,000
వార్షికం: రూ.12,000
రెండు ప్రధాన యాన్యుటీ ఆప్షన్లు
ఆప్షన్ I: లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ 100% పర్చేజ్ ప్రైస్ మీ జీవితాంతం పెన్షన్ వస్తుంది.
మరణం తర్వాత కొనుగోలు చేసిన మొత్తం (Purchase Price) 100% నామినీకి తిరిగి ఇస్తారు.
ఆప్షన్ II: జాయింట్ లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ 100% పర్చేజ్ ప్రైస్ మీరు లేదా మీ జీవిత భాగస్వామి ఎవరు జీవించి ఉన్నా పెన్షన్ కొనసాగుతుంది.
ఇద్దరూ మరణించిన తర్వాత Purchase Price 100% నామినీకి ఇస్తారు.
నెలకు రూ.21,000కుపైగా పెన్షన్ ఎలా?
LIC కాలిక్యులేటర్ ప్రకారం, 40 సంవత్సరాల వయస్సులో ఉన్న వ్యక్తి సరళ్ పెన్షన్ పథకంలో సుమారు రూ.40 లక్షలు పెట్టుబడి పెడితే, సంవత్సరానికి సుమారు రూ.2,62,454 పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే నెలవారీగా సుమారు రూ.21,871 వరకు పెన్షన్ లభించవచ్చు. అయితే, యాన్యుటీ రేట్లు, పాలసీ ఎంపికలు, వయస్సు వంటి అంశాల ఆధారంగా ఈ మొత్తం మారవచ్చు.
పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవాల్సిన విషయం
పెన్షన్ మొత్తం, రాబడి, ఇతర ప్రయోజనాలు కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు LIC అధికారిక వివరాలు లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.
- Tags
- lic
- LIC Saral Pension
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!