Site icon NTV Telugu

గుడ్‌న్యూస్ చెప్పిన ఎల్ఐసీ..

క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింది.. ఓవైపు క‌రోనా.. మ‌రోవైపు.. క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూలు.. ఆర్థికంగా చాలా మందిని దెబ్బ‌కొట్టాయి.. దీంతో.. రెగ్యుల‌ర్‌గా ఈఎంఐలు క‌ట్టేవారు కూడా చెల్లించ‌లేని ప‌రిస్థితి.. పాల‌సీలు క‌ట్ట‌లేక చేతులెత్తేసిన‌వారు ఎంద‌రో.. అయితే, అలాంటి వారికి గుడ్‌న్యూస్ చెప్పింది.. ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)… వ్యక్తిగత ల్యాప్స్డ్ పాలసీల పునరుద్ధరణ కోసం.. ఇప్పుడు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.. పాలసీ ప్రీమియం స‌కాలంలో చెల్లించ‌లేక మ‌ధ్య‌లోనే నిలిచిపోయిన త‌మ పాలసీల తిరిగి పునరుద్దరించ‌డానికి చూసేవారికి అవ‌కాశం క‌ల్పించింది ఎల్ఐసీ.. అయితే, దానికి అంటూ ఓ స‌మ‌యాన్ని నిర్దేశించింది.. ఫిబ్రవరి 7వ‌ నుంచి మార్చి 25వ తేదీ 2022 మధ్య కాలంలో అర్హత కలిగి ఉన్న పాలసీదారులు నిలిచిపోయిన త‌మ పాల‌సీల‌ను పునరుద్దరించు కోవ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది.

Read Also: అమెజాన్ సంచలనం.. లాభాల్లో రికార్డు..!

మ‌రోవైపు.. కోవిడ్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ త‌ర్వాత హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంద‌ని గుర్తించిన ఎల్ఐసీ.. కొత్త పాల‌సీ కంటే.. నిలిచిపోయిన పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ మ‌రింత ఈజీగా జ‌రిగిపోయే ప‌ని కాబ‌ట్టి.. ఈ నిర్ణ‌యం తీసుకుంది.. పాలసీదారులకు వారి పాలసీలను పునరుద్ధరించడానికి, జీవిత వర్తింపును పునరుద్ధరించడానికి, వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడానికి ఇది ఒక మంచి అవకాశం అంటూ త‌న ప్ర‌క‌ట‌నలో పేర్కొంది ఎల్ఐసీ.. అర్హత కలిగిన పాల‌సీదారులు త్వ‌ర‌ప‌డాల‌ని.. ఇప్పుడు ఆలస్యం రుసుములోనూ రాయితీ పొందవచ్చు అని పేర్కొంది..

Exit mobile version