Site icon NTV Telugu

LIC New Policy: నెలకు రూ.5 వేల పెట్టుబడితో రూ.10 లక్షల ఆదాయం..

Lic Policy

Lic Policy

భారత దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎన్నో పథకాల ను అందిస్తుంది. అందులో కొన్ని పథకాలు మంచి వడ్డీని ఇస్తున్నాయి.. ఇప్పుడు మరో కొత్త పాలసీని ప్రవేశ పెట్టింది.. ఆ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ అనేది ముఖ్యంగా కుటుంబానికి ఆర్థిక భద్రత, రక్షణను అందించడానికి ఎల్‌ఐసీ రూపొందించింది. ప్రీమియం-చెల్లింపు వ్యవధి ముగింపు నుంచి మెచ్యూరిటీ సమయం వరకూ ఈ ప్లాన్ వార్షిక సర్వైవర్ ప్రయోజనాల ను అందిస్తుంది. అదనంగా ఈ పాలసీలో మెచ్యూరిటీ తర్వాత లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భం లో ఒకేసారి బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. పాలసీ దారుడు మరణించిన సందర్బంగా నామినికి మొత్తాన్ని చెల్లిస్తారు.. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో హామీ ఇవ్వబడిన ప్రయోజనాలు నమ్మకమైన ఆర్థిక భద్రతా వలయంగా పనిచేస్తాయి.. ఇకపోతే పాలసీదారుడు మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి సహాయం చేయడానికి ఇది డబ్బు, బీమా కవరేజీ రెండింటినీ అందించడమే ఈ ప్లాన్ ప్రాథమిక ప్రయోజనం. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో హామీ ఇవ్వబడిన ప్రయోజనాలు నమ్మకమైన ఆర్థిక భద్రతా వలయంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ పాలసీ గురించి వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

ఈ పాలసీ లో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.వంద సంవత్సరాల వయస్సు వరకూ జీవితకాల రిస్క్ కవర్ చేస్తుంది..అలాగే 30 ఏళ్ల వరకు ఆదాయం హామీ ఇస్తుంది.. ప్రమాదవశాత్తు మరణ కవరేజ్, వైకల్య ప్రయోజనం.. పాలసీ తీసుకోవాలి అనుకుంటే కనీసం 90 రోజులు మరియు గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి..ఈ పాలసీని కొనుగోలు చేసే 30 ఏళ్ల పురుషుడు నెలవారీ రూ. 5,000, త్రైమాసిక రూ. 15,000 లేదా సంవత్సరానికి రూ. 50,000 పెట్టుబడి పెట్టవచ్చు. కనీస హామీ మొత్తం రూ. 2,00,000. అయితే పాలసీ లో ప్రవేశించే సమయాని కి అతని మూప్పై ఏళ్లు ఉంటే రూ.10 లక్షల హామీ మొత్తం ఉంటుంది.. లోన్ తీసుకొనే అవకాశాలు కూడా ఉన్నాయి..

Exit mobile version