Site icon NTV Telugu

LIC New Jeevan Anand: చనిపోయే వరకు తోడుండే పాలసీ.. రూ.45 తో రూ.25 లక్షల రిటర్న్స్‌తో పాటు లైఫ్ టైమ్ ఫ్రీ కవరేజ్!

Lic New Jeevan Anand

Lic New Jeevan Anand

LIC New Jeevan Anand: సామాన్యుల ఆర్థిక భద్రతకు పెద్దపీట వేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందిస్తున్న “న్యూ జీవన్ ఆనంద్” (ప్లాన్ నెం. 915) పాలసీ ఇన్వెస్టర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలంలో భారీ నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఎల్ఐసీ అందిస్తున్న ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Iran Israel Conflict: ‘‘థాంక్యూ ఇండియా’’ అని రాసి మరీ, ఇజ్రాయిల్‌‌ను కొడుతున్న ఇరాన్…

చిన్న మొత్తంతో పెద్ద నిధి..
చాలా మంది భారీ లాభాల కోసం నెలకు వేలల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. కానీ, ఈ ప్లాన్ ఆ ఆలోచనను మారుస్తోంది. 35 ఏళ్ల వ్యక్తి, ర.5 లక్షల హామీ మొత్తంతో (Sum Assured) 35 ఏళ్ల కాలపరిమితికి ఈ పాలసీని తీసుకుంటే.. వార్షిక ప్రీమియం సుమారు రూ.16,300 మాత్రమే. ఈ మొత్తాన్ని రోజువారీగా లెక్కిస్తే కేవలం రూ.45 మాత్రమే అవుతుంది. ఈ పాలసీ గడువు ముగిసే సమయానికి (35 ఏళ్ల తర్వాత), ప్రస్తుత బోనస్ రేట్ల ప్రకారం పాలసీదారుడు ఏకంగా రూ.25 లక్షల భారీ మొత్తాన్ని అందుకుంటారు. ఇందులో బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, రివిజనరీ బోనస్ రూ.8.60 లక్షలు, ఫైనల్ అడిషనల్ బోనస్ రూ.11.50 లక్షలు కలిసి ఉంటాయి.

మెచ్యూరిటీ తర్వాత కూడా ‘లైఫ్ రిస్క్ కవర్’
సాధారణ బీమా పాలసీలకు, జీవన్ ఆనంద్‌కు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. సాధారణంగా మెచ్యూరిటీ డబ్బులు రాగానే బీమా రక్షణ ముగిసిపోతుంది. కానీ, ఈ ప్లాన్‌లో రూ.25 లక్షల మెచ్యూరిటీ అమౌంట్ అందుకున్న తర్వాత కూడా, పాలసీదారుని జీవితాంతం రూ.5 లక్షల ఉచిత బీమా కొనసాగుతుంది. అంటే భవిష్యత్తులో పాలసీదారుడు ఎప్పుడు మరణించినా, వారి కుటుంబానికి అదనంగా మరో రూ.5 లక్షలు అందుతాయి. ఈ పాలసీ కేవలం పొదుపు మాత్రమే కాదని, పన్ను ఆదాకు కూడా మార్గం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాన్‌లో భాగంగా చెల్లించే ప్రీమియంలపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. మెచ్యూరిటీ ద్వారా వచ్చే మొత్తం పూర్తిగా పన్ను రహితం. పాలసీ తీసుకున్న రెండేళ్ల తర్వాత అత్యవసర అవసరాల కోసం లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా ఈ ప్లాన్ పొందవచ్చు. 15 నుంచి 35 సంవత్సరాల వరకు తమకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అదనపు రక్షణ కోసం యాక్సిడెంటల్ డెత్ లేదా క్రిటికల్ ఇల్‌నెస్ వంటి రైడర్లను కూడా జోడించుకోవచ్చు.

READ ALSO: IPL 2026: అస్త్రశస్త్రాలతో సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా?

Exit mobile version