LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
- ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు
- LIC న్యూ జీవన్ సాథీ- సింగిల్ ప్రీమియం'
- 'LIC న్యూ జీవన్ సాథీ- లిమిటెడ్ ప్రీమియం'
- మార్కెట్ రిస్క్‌కు సంబంధం లేకుండా స్థిరమైన రాబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా “జీవన్ సాథి” బ్రాండ్ కింద రెండు కొత్త సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ప్రకటించింది. LIC న్యూ జీవన్ సాథీ- సింగిల్ ప్రీమియం’, ‘LIC న్యూ జీవన్ సాథీ- లిమిటెడ్ ప్రీమియం’ పేర్లతో ఈ కొత్త పాలసీలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ రెండు ప్లాన్లు నాన్-పార్, నాన్-లింక్డ్, వ్యక్తిగత సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్లుగా రూపొందించారు.
మార్కెట్ రిస్క్‌కు సంబంధం లేకుండా స్థిరమైన రాబడులు పొందాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని LIC ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడమే ఈ కొత్త ప్లాన్ల లక్ష్యమని LIC వెల్లడించింది. కస్టమర్లకు ప్రీమియం చెల్లింపుల్లో మరింత సౌలభ్యం కల్పించేందుకు రెండు వేరియంట్లు తీసుకొచ్చినట్లు తెలిపింది.
Also Read
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
జూన్ 1 నుంచి అందుబాటులోకి
LIC ప్రకటన ప్రకారం, ఈ రెండు కొత్త ప్లాన్లు 2026 జూన్ 1 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. భారతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్పత్తులను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
రెండు ప్లాన్ల ప్రత్యేకతలు
1. New Jeevan Sathi – Single Premium
ఒక్కసారిగా ప్రీమియం చెల్లించే విధానం
దీర్ఘకాల సేవింగ్స్‌తో పాటు లైఫ్ కవర్
మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు
స్థిరమైన ప్రయోజనాలు పొందే అవకాశం
2. New Jeevan Sathi – Limited Premium
పరిమిత కాలం వరకు మాత్రమే ప్రీమియం చెల్లించే సౌకర్యం
కుటుంబ భద్రతతో పాటు సేవింగ్స్ ప్రయోజనం
ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు అనుకూలంగా రూపొందించారు
ఎవరికీ ఉపయోగకరం?
దీర్ఘకాల సేవింగ్స్ కోరుకునేవారికి
మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్ కోరుకునే వారికి
కుటుంబ భద్రతతో పాటు సేవింగ్స్ ప్లాన్ వెతుకుతున్న వారికి
రిటైర్మెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!