NTV Telugu Site icon

Learn to Earn: ఇల్లు కొనాలా? ఇన్వెస్ట్‌ చేయాలా?. ఈ వీడియో చూసి.. నేర్చుకోండి.. సంపాదించుకోండి.

05kwlpn5r3q Hd

05kwlpn5r3q Hd

Learn to Earn: లెర్న్‌ టు ఎర్న్‌ అనేది హైదరాబాద్‌లోని వివేకం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌వాళ్లు ఇస్తున్న సందేశం. ఆ కంపెనీ నినాదం. మన దగ్గర డబ్బులు ఉంటే వాటితో ఇల్లు కొనాలా లేక వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్‌ చేయాలా అనే డౌట్‌ వస్తుంది. ఇలాంటి సందేహాలను ఎన్నింటినో ఈ సంస్థ తీరుస్తుంది. ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి మంచి సలహాలు సూచనలు ఇస్తుంది. అది కూడా పైసా ఖర్చు లేకుండా. ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించటం కోసం ఇటీవల హైదరాబాద్‌లో ఒక సెషన్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు పెట్టుబడిదారులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. ‘వివేకం’ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీవీకే ప్రసాద్‌ స్వయంగా ఇచ్చిన ప్రజెంటేషన్‌ని శ్రద్ధగా ఆలకించారు. అది ఎంతో ఆసక్తికరంగా ఉండటం కూడా చెప్పుకోదగ్గ విషయం. సెబీ వద్ద రిజిస్టర్‌ అయిన ఈ ఇన్వెస్ట్మెంట్‌ అడ్వైజరీ.. స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, పోర్ట్‌ఫోలియో, ఫిక్స్‌డ్‌ ఇన్‌కం వంటి ప్రొడక్టులను అందిస్తోంది.