NTV Telugu Site icon

ఆర్బీఐలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసు అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 చివరి తేదీగా నిర్ణయించారు. దీనికి పదో తరగతి విద్యార్హత. ఏప్రిల్ 9..10 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి. హైదరాబాద్‌లో 57, అహ్మదాబాద్‌లో 50, బెంగళూరులో 28, భోపాల్‌లో 25, భువనేశ్వర్‌లో 24, చండీగఢ్ లో 31, చెన్నైలో 71, గౌహతిలో 38, జమ్మూలో 9, జైపూర్ లో 43, కాన్పూర్ లో 69, కోల్‌కతాలో 35, ముంబైలో 202, నాగ్‌పూర్ లో 55, న్యూ ఢిల్లీలో 50, పాట్నాలో 28, తిరువనంతపురంలో 26 ఖాళీలున్నాయని పేర్కొంది.