Site icon NTV Telugu

Smart Tires Launch: స్మార్ట్ టైర్లను లాంచ్ చేసిన JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్

Untitled Design (16)

Untitled Design (16)

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు “ఇంటెలిజెంట్ మొబిలిటీ” యొక్క కొత్త యుగంలోకి ప్రవేశించింది. JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో మొట్టమొదటి ఎంబెడెడ్ స్మార్ట్ టైర్లను విడుదల చేసింది. ప్రయాణీకుల వాహనాల కోసం రూపొందించబడిన ఈ ఆవిష్కరణ, కేవలం టైర్ లాగానే కాకుండా “స్మార్ట్ మెషిన్” లాగా పనిచేస్తుంది. ఈ టైర్లు వాహన పనితీరు, భద్రత, ఇంధన సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తాయని కంపెనీ పేర్కొంది.

Read Also:Caffeine Benefits: కెఫిన్ తగిన మోతాదులో తీసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..

ఈ స్మార్ట్ టైర్‌ను తామే అభివృద్ధి చేసినట్లు JK టైర్ సంస్థ తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని బాన్‌మోర్‌లోని తన తయారీ కర్మాగారంలో కంపెనీ దీనిని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ టైర్లలో గాలి పీడనం, ఉష్ణోగ్రత సంభావ్య గాలి లీకేజీలు వంటి సమాచారాన్ని కనిపెట్టే సెన్సార్లు అమర్చబడి ఉంటాయని.. ఈ డేటా డ్రైవర్‌ను ఆ సమయంలో హెచ్చరిస్తుందని సంస్థ వివరించింది. ఇది రహదారి భద్రత, నిర్వహణ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొంది. ఈ సాంకేతికత టైర్లు జీవితకాలాన్ని పొడిగించడానికి, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

Read Also:Woman Conductor: హ్యట్సాఫ్ మేడం.. చంటి బిడ్డతో ఎత్తుకుని.. డ్యూటీ చేస్తున్న మహిళా కండకర్ట్

JK టైర్ విజయం కేవలం ఒక ఉత్పత్తి ఆవిష్కరణ మాత్రమే కాదు, “ఆత్మనిర్భర్ భారత్” (మేక్ ఇన్ ఇండియా) కి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ కూడా అంటూ కంపెనీ యాజమాన్యం తెలిపింది.. ఎంబెడెడ్ స్మార్ట్ టైర్ ఆవిష్కరణ జెకె టైర్ ఆవిష్కరణ ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయని.. జేకే టైర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రఘుపతి సింఘానియా అన్నారు. ఈ స్మార్ట్ టైర్లను మొదటగా ఆఫ్టర్ మార్కెట్ కోసం విడుదల చేసినట్లు తెలిపారు. ఈ స్మార్ట్ టైర్లు 14 అంగుళాల నుండి 17 అంగుళాల వరకు సైజుల్లో లభిస్తాయని.. . ఈ టైర్లను కాంపాక్ట్ కార్ల నుండి ప్రీమియం సెడాన్ల వరకు వాహనాలలో ఉపయోగించవచ్చన్నారు. వీటి ధరలకు సంబంధించి.. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

Exit mobile version