NTV Telugu Site icon

Jio 5G: అదిరిపోయే ఆఫర్.. రూ.601తో ఏడాదంతా అన్‌లిమిటెడ్‌ డేటా

Jio

Jio

టెలికాం రంగంలో జియో దూసుకుపోతుంది. తాజాగా జియో కొత్త వోచర్‌ను తీసుకొచ్చింది. సంవత్సరం పాటు ఏకధాటిగా 5జీ డేటాను వినియోగించుకోవడానికి రూ.601తో అన్‌లిమిటెడ్‌ 5జీ అప్‌గ్రేడ్‌ వోచర్‌‌ను తీసుకొచ్చింది. 4జీ వినియోగదారులు కూడా ఈ వోచర్‌ సాయంతో 5జీ సేవలను ఆనందించే అవకాశం కల్పించింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రిలయన్స్ జియో కొత్త ప్లాన్ “అల్టిమేట్ 5G అప్‌గ్రేడ్ వోచర్”తో మళ్లీ తిరిగి వచ్చింది. రూ. 601 ప్లాన్ ఒక సంవత్సరం పాటు అపరిమిత 5G డేటాను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Rajnath Singh: కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది..

రూ.239 కంటే ఎక్కువ రీఛార్జి చేసిన వారందరికీ ఈ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఏడాది జులైలో ప్లాన్ల ధరల సవరణ సందర్భంగా అపరిమిత 5జీ డేటాకు పరిమితి నిర్దేశించింది. ఎవరైతే రోజుకు 2జీబీ డేటా అందించే ప్లాన్‌ను రీఛార్జి చేసి ఉంటారో వారికి మాత్రమే అపరిమిత 5జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది. అంటే నెలకు రూ.349 ప్లాన్‌ రీఛార్జి చేసే వారికే ఉచిత 5జీ డేటా అందనుంది. అయితే తక్కువ డేటా ప్లాన్‌ తీసుకునే వారికీ 5జీ సేవలను అందించేందుకు ఆ మధ్య రూ.51, రూ.101, రూ.151తో బూస్టర్‌ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. తాజాగా ఏడాది పొడవునా అపరిమిత 5జీ డేటాను అందించేందుకు రూ.601 వోచర్‌ను తెచ్చింది. దీన్ని మై జియో యాప్‌లో కొనుగోలు చేసి యాప్‌లోనే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Kamala harris: ప్రచారంలో కమల దుబారా ఖర్చులు! ఐస్‌క్రీమ్‌లకు, ఫుడ్‌కి ఎంతంటే..!

Show comments