Site icon NTV Telugu

Jio and Airtel: ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా జియో, ఎయిర్‌టెల్‌ రీఛార్జ్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

Jio And Airtel

Jio And Airtel

Jio and Airtel: ఇవాళ ఇండియా 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్లు, ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌ బెనెఫిట్లు ప్రకటించాయి. ఈ రోజు జియో కస్టమర్లు 2 వేల 999 రూపాయలు మరియు 719 రూపాయలతో రీఛార్జ్‌ చేసుకుంటే వంద శాతం క్యాష్‌ బ్యాక్‌ ప్రయోజనాలు పొందుతారు. ఎయిర్‌టెల్‌ యూజర్లు 519 మరియు 779 రూపాయలతో రీఛార్జ్‌ చేసుకుంటే వివిధ రూపాల్లో క్యాష్‌ బ్యాక్‌ బెనెఫిట్లు లభిస్తాయి.

ఆదాయం రెట్టింపు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్పొరేట్‌ ఆదాయాలు రెండంకెల్లో పెరిగాయి. కానీ లాభాలు మాత్రం రికార్డ్‌ స్థాయిలో పడిపోయాయి. 2021 తొలి త్రైమాసికంతో పోల్చితే ఈసారి కార్పొరేట్‌ ఆదాయాలు తక్కువే నమోదయ్యాయి. గడచిన నాలుగు త్రైమాసికాల కన్నా కూడా ఇదే తక్కువని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. సేల్స్‌ పెరుగుతున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి నెలకొనటం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Azadi ka amrit mahotsav: భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం.. స్వాతంత్ర్య అమృత మహోత్సవం..

వసూళ్లు భళా

ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 40 శాతం పెరిగాయి. ఇన్‌కం ట్యాక్స్‌ కలెక్షన్లు 52 శాతం వృద్ధి చెందటం కలిసొచ్చింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల్లోనే మూడో వంతు కన్నా ఎక్కువ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరిగాయి. కార్పొరేషన్‌ మరియు పర్సనల్‌ ఇన్‌కం ట్యాక్స్‌ కలిపి 5 ట్రిలియన్‌ రూపాయల వరకు వచ్చాయి. 14 ట్రిలియన్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు 35 శాతం టార్గెట్‌ రీచ్‌ అయింది.

ఎస్‌బీఐ 3వసారి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంసీఎల్‌ఆర్‌ని 20 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తోంది. దీంతో మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ ప్రస్తుతం 7 పాయింట్‌ మూడు, ఐదు శాతానికి పెరిగింది. ఎంసీఎల్‌ఆర్‌తోపాటు ఈబీఎల్‌ఆర్‌ మరియు రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌ని కూడా 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఎస్‌బీఐ వడ్డీ రేట్లు పెరగటం గత మూడు నెలల్లో ఇది మూడోసారి.

లుపిన్‌.. న్యూ ప్లాన్‌

అమెరికన్‌ ఫార్మాసిటికల్‌ కంపెనీ లుపిన్‌ ఆ దేశంలోని ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియాలో సవరణలు చేస్తోంది. నోటి ద్వారా వేసుకునే సాధారణ ఔషధాల నుంచి సంక్లిష్ట జనరిక్‌ మెడిసిన్స్‌ వైపు ఫోకస్‌ పెడుతోంది. మార్కెట్‌లో మందుల రేట్ల తగ్గుదల వల్ల సంస్థపై పడుతున్న ఆర్థిక ప్రభావం నుంచి తేరుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు కంపెనీ సీఈవో వినితా గుప్తా చెప్పారు.

ఇక ఒకే టారిఫ్‌

రాష్ట్రాలు సేకరించే పునరుత్పాదక ఇంధనానికి ఇకపై ఒకే రకమైన టారిఫ్‌ను వసూలు చేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ ప్రతిపాదించింది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆఫర్‌ చేసే ప్రాజెక్టులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. రెనివబుల్‌ ఎనర్జీ ప్రొక్యూర్‌మెంట్ల విషయంలో ఇదొక భారీ మార్పని చెప్పొచ్చు.

Exit mobile version