Site icon NTV Telugu

Jeep: మెరిడియన్‌… మేడ్ ఇన్ ఇండియా…

ఇండియాలో ఎస్‌యూవీ జీప్ కార్ల సంస్థ చాలా కాలంగా 7 సీట‌ర్ కార్ల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న‌ది. చాలా కాలం క్రిత‌మే జీప్ 7 సీట‌ర్ కారును మార్కెట్‌లోకి తీసుకొని రావాల్సి ఉన్నా కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. 7 సీట‌ర్ ఎస్‌యూవీకి సంబంధించిన పేరు ఫైనల్ కాక‌పోవ‌డం వ‌ల‌నే వాయిదా ప‌డుతూ వ‌చ్చిన‌ట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సుమారు 70 పేర్ల‌ను ప‌రిశీలించారు. ఇందులో ఫైన‌ల్‌గా మెరిడియ‌న్ అనే పేరును నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. మెరిడియ‌న్‌ను మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా త‌యారు చేస్తున్న‌ట్టు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

Read: Hijab Issue: చల్లార‌ని హిజాబ్ వ్య‌వ‌హారం… ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రించిన విద్యార్ధులు…

మెరిడియ‌న్ జీప్ కారుకు సంబంధించిన మోడ‌ల్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది. అయితే, మెరిడియ‌న్‌కు సంబంధించి ఇంజ‌న్ సామ‌ర్థ్యం ఇత‌ర ఫీచ‌ర్ల‌కు సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం వెల్ల‌డించ‌లేదు. అన‌ధికారిక స‌మాచారం ప్ర‌కారం, పెట్రోల్ డీజిల్ వెర్ష‌న్ల‌లో ఇది ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు, ఇందులో 2.0 ఇంజ‌న్‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ బాక్స్ ఉంటుంద‌ని, 10.25 అంగుళాల ఇన్ఫోంటైన్మెంట్ స్క్రీన్, 4 జోన్ వెద‌ర్ కంట్రోల్ వంటి ఫీచ‌ర్లు ఉండ‌బోతున్నాయి. 7 సీట‌ర్ జీప్ ధ‌ర రూ. 35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version