Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో వినియోగదారులు, వివిధ ఏజెన్సీలు పెట్టుకున్న అంచనాలపై UIDAI తాజాగా సంచలన స్పష్టతనిచ్చింది. ఆధార్‌ను కేవలం గుర్తింపు పత్రంగానే పరిగణించాలని, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంగా కాదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ (DOB) ముద్రించి ఉన్నప్పటికీ, దానిని అధికారిక పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంగా పరిగణించకూడదని స్పష్టం చేస్తూ ఆధార్ యూజర్స్ ఏజెన్సీలు (AUA), ఈ-కేవైసీ యూజర్స్ ఏజెన్సీలకు (KUA) లేఖ రాసింది.
ఎందుకు పుట్టిన తేదీకి ప్రూఫ్ కాదంటే..
ఆధార్ అనేది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును (Identity) ధృవీకరించడానికి ఉద్దేశించినది మాత్రమేనని UIDAI వివరించింది. ఆధార్ నమోదు సమయంలో వినియోగదారులు ఇచ్చే సమాచారం లేదా స్కూల్ సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ వంటి పత్రాల ఆధారంగా పుట్టిన తేదీని నమోదు చేస్తారు. ఒకవేళ వినియోగదారుడి వద్ద ఎలాంటి అధికారిక పత్రాలు లేకపోతే, వారి వయసు అంచనా ఆధారంగా సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ ఏడాది జనవరి 1వ తేదీని పుట్టిన తేదీగా తీసుకుంటుంది. అందుకే ఇది అన్ని వేళలా కచ్చితమైనది కాదని సంస్థ స్పష్టం చేసింది.
Also Read
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
- Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
- UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
గుర్తింపు మాత్రమే.. వయసు కాదు
ఆధార్ కార్డు సమర్పించిన వ్యక్తి, బయోమెట్రిక్ డేటా ప్రకారం.. అతను అసలైన వ్యక్తి అవునా కాదా? అనే విషయాన్ని మాత్రమే ఆధార్ ధృవీకరిస్తుంది. సెంట్రల్ డేటా రిపోజిటరీతో ఈ సమాచారాన్ని మ్యాచ్ చేసి గుర్తింపును నిర్ధారిస్తుంది కానీ, పుట్టిన తేదీని వెరిఫై చేయదు. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు లేదా ఇతర సేవల కోసం పుట్టిన తేదీని నిర్ణయించడంలో ఆధార్‌ను వాడుకోవాలా వద్దా అనే అంశం ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లేదా ఏజెన్సీల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని UIDAI తాజా ప్రకటనలో పేర్కొంది. ఆధార్ కార్డులోని అన్ని రూపాలు అంటే ఫిజికల్ కార్డ్, ఈ-ఆధార్, మాస్క్డ్ ఆధార్, ఆఫ్‌లైన్ XML, QR కోడ్ వంటివి గుర్తింపు (ID Proof), చిరునామా (Address Proof) ధృవీకరణకు కచ్చితంగా ఉపయోగపడతాయని UIDAI స్పష్టం చేసింది. దీంతో ఇకపై పుట్టిన తేదీ ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్లు మాత్రమే ప్రామాణికం కానున్నాయి.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!