International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
International Credit Cards: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, సింగపూర్, లండన్ అలాగే పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లోని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకులు.. భారతీయ శ్రీమంతులకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి లేదా పాత కార్డులను రీన్యూ చేయడానికి వెనకడుగు వేస్తున్నాయి! దీనికి కారణం ఆ కస్టమర్ల స్థోమత లేదా క్రెడిట్ స్కోర్ కానే కాదు.. మన దేశంలో ఉన్న విదేశీ మార్పిడి చట్టాలే (Forex rules) కారణం అని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశంలోని ‘లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్’ (LRS) ప్రకారం ఒక భారతీయుడు ఏడాదికి గరిష్టంగా 2,50,000 డాలర్లు (సుమారు రూ. 2 కోట్లకు పైగా) విదేశాలకు పంపుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కఠినమైన నిబంధన ఉంది. ఎల్ఆర్ఎస్ కింద విదేశాలకు పంపిన డబ్బును 180 రోజుల్లోగా (ఆరు నెలలు) ఏదైనా ఖర్చు చేయడానికి గానీ, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గానీ ఉపయోగించాలి. అలా చేయకుండా విదేశీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో, కరెంట్ ఖాతాలో లేదా ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఊరికే ఉంచడానికి వీల్లేదు. విదేశీ బ్యాంక్ ఖాతాలకు లింక్ అయిన క్రెడిట్ కార్డులు గడువు ముగిసి రీన్యూవల్‌కు వచ్చినప్పుడు, భారతీయులు తమ ఖాతాల్లో పెద్ద మొత్తంలో ఖాళీ డిపాజిట్లు ఉంచే అవకాశం లేకపోవడంతో ఆ బ్యాంకులు కార్డులు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
మరోవైపు విదేశీ ప్రయాణాల్లో డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉదాహరణకు మీరు విదేశాల్లో రూ. 1 లక్ష విలువైన వస్తువు కొన్నారనుకోండి. షాప్ కౌంటర్ వద్ద కనిపించే ధర ఒకటి అయితే, మీ ఇండియన్ బ్యాంక్ స్టేట్మెంట్లో పడే బిల్లు వేరేలా ఉంటుంది. ఎందుకంటే విదేశీ కార్డు లావాదేవీల్లో ఫారెక్స్ మార్కప్, క్రాస్-కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలు, ఏటీఎం విత్‌డ్రా ఫీజులు, ‘డైనమిక్ కరెన్సీ కన్వర్షన్’ (DCC) వంటి అనేక హిడెన్ ఛార్జీలు ఉంటాయి. విదేశాల్లో పేమెంట్ చేసేటప్పుడు ‘INR’ (భారతీయ రూపాయి) ఎంచుకోవడం కంటే, అక్కడి స్థానిక కరెన్సీలోనే చెల్లించడం వల్ల రూపాయి ఆదా అవుతుంది. మీ ప్రయాణ బడ్జెట్ ఎంతో ముందే తెలిస్తే ‘ప్రిపేడ్ ఫారెక్స్ కార్డ్’ ఎంచుకోవడం సరైన ఆప్షన్. ఇండియా వదిలే ముందే ఇందులో డబ్బులు లోడ్ చేసుకోవచ్చు. ఆ సమయంలో ఉన్న ఎక్స్ఛేంజ్ రేట్‌ను లాక్ చేసే అవకాశం ఉండటం వల్ల, ప్రయాణంలో ధరలు పెరిగినా ప్రభావం పడదు. థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ ఫారెక్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దీపేష్ వర్మ మాట్లాడుతూ.. కేవలం ఎక్స్ఛేంజ్ రేట్ మాత్రమే కాకుండా, గ్రౌండ్ లెవల్లో ఉండే మొత్తం ఛార్జీల నిర్మాణాన్ని (Fee Structure) అర్థం చేసుకుని కార్డ్ ఎంచుకోవాలని సూచించారు.
Also Read
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
అలాగే తరచూ విదేశాలకు వెళ్లేవారికి తక్కువ లేదా ‘జీరో ఫారెక్స్ మార్కప్’ ఉండే క్రెడిట్/డెబిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి. అయితే కేవలం ‘జీరో ఫారెక్స్’ అనే మాట చూసి మోసపోకుండా.. దాగి ఉన్న ఏటీఎం ఛార్జీలు, వార్షిక ఫీజులు, క్రాస్ కరెన్సీ ఛార్జీల కండిషన్లను పూర్తిగా చదవాలి. ఇక ట్యాప్-అండ్-పే, మొబైల్ వ్యాలెట్ల వల్ల విదేశాల్లో చెల్లింపులు తేలికయ్యాయనడంలో సందేహం లేదు, కానీ దీనివల్ల ఫారెక్స్ ఛార్జీలు మాయమైపోవు! మీ ఫోన్ వెనుక ఏ క్రెడిట్ కార్డ్ లింక్ అయి ఉందో, ఆ కార్డుకు సంబంధించిన ఫారెక్స్ ఛార్జీలు వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి.
తాజావార్తలు
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!