Site icon NTV Telugu

Infosys bonus: గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్.. ఎంత బోనస్ ప్రకటించిందంటే..!

05

05

Infosys bonus: క్యూ1లో మెరుగైన పనితీరు నేపథ్యంలో ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పనితీరు ఆధారిత బోనస్లను ప్రకటించింది. ఆగస్టు నెల వేతనంతో పాటు అర్హులైన ఉద్యోగులకు సగటున 80 శాతం బోనస్ చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ఫోసిస్ ఈ స్థాయిలో బోనస్‌ను ప్రకటించడం టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. .

READ MORE: Father Kills Teenage Daughter: చూడకూడని స్థితిలో కూతురు.. నరికి చంపిన తండ్రి..

89 శాతం బోనస్‌లు..
ఇన్ఫోసిస్ తమ కంపెనీ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ఈ చెల్లింపులు జరగనునున్నట్లు పేర్కొంది. లెవల్ పీఎల్4 ఉద్యోగుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి అత్యధికంగా 89 శాతం బోనస్ చెల్లించనున్నారు. అంచనాలు అందుకున్న ఉద్యోగులకు 80 శాతం చొప్పున చెల్లింపులు జరగనున్నాయి. లెవల్ పీఎల్, లెవల్ పీఎల్ 6 ఉద్యోగులకు 78-87 శాతం, 75-85 శాతం, పీఎల్4, పీఎల్, పీఎల్ కేటగిరీల్లోని ఉద్యోగులకు 80 శాతం, 75 శాతం, 70 శాతం చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు పేర్కొంది. జులై 23న వెలువరించిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం 8.7 శాతం వృద్ధి చెంది రూ.6921 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 7.5 శాతం వృద్ధితో రూ.42,279 కోట్లుగా పేర్కొంది. ఆగస్టు 20 నాటికి ఇన్ఫోసిస్ రూ. 6.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థలలో ఒకటిగా నిలిచింది. స్టాక్ మార్కెట్‌లో బుధవారం కంపెనీ షేరు ధర రూ.1,495.10గా ముగిసింది.

READ MORE: LCA Tejas Mark 1A Jets: మిగ్-21 మించింది రాబోతుంది.. ఇక పాకిస్థాన్‌కు వణుకే..

Exit mobile version