కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.. ఫస్ట్ వేవ్ దారుణంగా దెబ్బకుట్టి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయగా.. సెకండ్ వేవ్‌లో కూడా దాని ప్రభావం స్పష్టం కనిపించింది.. అయితే, థర్డ్ వేవ్‌లో ఆ పరిస్థితి అంతంతే అని చెప్పాలి.. ఎందుకంటే.. క్రమంగా అన్ని దేశాలు వృద్ధిరేటులో పురుగోతి సాధిస్తున్నాయి.. భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) 5.4 శాతం పురోగమించినట్టు గణాంకాలు చెబుతున్నాయి… వృద్ధి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ, డిసెంబర్ త్రైమాసికంలో ఈ స్థాయి ఎకానమీ పురోగతి ఏ దేశం సాధించకపోవడం మరో విశేషం.. దీనితో ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో.. ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది భారత్.. ఇక, భారత్ తర్వాత చైనా మూడవ త్రైమాసికంలో 4 శాతం ఎకానమీ వృద్ధి రేటు నమోదు చేసింది.. మరోవైపు.. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ, వ్యవసాయం, నిర్మాణ, ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవా రంగాల వేగం తాజా గణాంకాల ప్రకారం ఇంకా తక్కువగానే ఉన్నాయి.
Read Also: Astrology: మార్చి 1, మంగళవారం దినఫలాలు
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఈ మేరకు తాజా గణాంకాలను వెల్లడించింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి రేటు 20.3 శాతంగా నమోదైతే.. రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 8.5 శాతంగా.. ప్రస్తుత సమీక్ష క్వార్టర్‌లో 5.4 శాతం పురోగతి సాధించింది.. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికాల్లో ఎకానమీ పరిస్థితి చూస్తే, కరోనా సవాళ్ల నేపథ్యంలో వృద్ధిలేకపోగా ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్ త్రైమాసికాల్లో వరుసగా 23.8 శాతం, 6.6 శాతం క్షీణత నమోదయ్యాయి. కాగా, అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా 0.7 శాతం పురోగతి కనిపించింది. 2011–12 ధరలను బేస్‌గా తీసుకుంటూ, ద్రవ్యోల్బణం ప్రాతిపదికన పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఎకానమీ విలువ రూ.36,22,220 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ విలువ రూ. 38,22,159 కోట్లకు పెరిగింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మూడవ క్వార్టర్‌లో 5.4 శాతానికి చేరింది.
