Stock Market: 2 రోజుల లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్

  • 2 రోజుల లాభాలకు బ్రేక్
  • భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్
  • లక్షల కోట్ల సంపద ఆవిరి
Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజుల లాభాలకు బ్రేకులు పడ్డాయి. యుద్ధానికి ఐదు రోజులు గడువు ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ రెండు రోజులు బాగానే పుంజుకుంది. పెట్టుబడిదారులు నష్టాల నుంచి కోలుకున్నారు. అయితే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించడంతో మార్కెట్‌కు మళ్లీ భయాలు మొదలయ్యాయి. దీంతో శుక్రవారం ఉదయమే భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు… చివరి దాకా నష్టాల్లోనే ట్రేడ్ అయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.

ఇది కూడా చదవండి: Live in Relationship: వయోజనురాలితో వివాహితుడు సహజీవనం చేస్తే తప్పేంటి? హైకోర్టు కీలక తీర్పు

సెన్సెక్స్ 1,690 పాయింట్లు నష్టపోయి 73, 583 దగ్గర ముగియగా.. నిఫ్టీ 486 పాయింట్లు నష్టపోయి 22,819 దగ్గర ముగిసింది. ఇక రూపాయి సరికొత్త రికార్డు కనిష్ట ముగింపుకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.73 దగ్గర సరికొత్త రికార్డు కనిష్ట దగ్గర ముగిసింది.

నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ భారీ నష్టాలు చవిచూడగా.. ఓఎన్‌జీసీ, టీసీఎస్, విప్రో, భారతీ ఎయిర్‌టె, కోల్ ఇండియా వంటి కొన్ని స్టాక్‌లు లాభపడ్డాయి.