Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee: అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థను గడగడలాడిస్తున్నాయి. భారత కరెన్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీగా పతనమైంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో మంగళవారం రూపాయి రికార్డు స్థాయి కనిష్టానికి చేరుకుంది. ఈ రోజు ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 95.42 వద్దకు పడిపోయింది. గత వారం నమోదైన 95.33 కనిష్ట స్థాయిని ఇది అధిగమించి, సరికొత్త రికార్డును సృష్టించింది.
ముంచుకొస్తున్న చమురు సంక్షోభం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన “ప్రాజెక్ట్ ఫ్రీడమ్” (హోర్ముజ్ జలసంధిని తెరిపించే చర్య) కారణంగా అమెరికా – ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు తీవ్రమయ్యాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తలెత్తడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ 5.45 శాతం పెరిగి $114.06 వద్దకు చేరింది. డబ్ల్యూటీఐ (WTI) బ్యారెల్ ధర $105.02 వద్ద ట్రేడవుతోంది.
Also Read
- Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన 'షాపింగ్' కింగ్..
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- RBI New FD Rules: ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టే వారికి కీలక సమాచారం.. RBI కొత్త నిబంధనలతో ఏం మారుతుంది?
- OBHS Team Railway: రైళ్లలో కొత్త హౌస్‌కీపింగ్ బృందం.. ఇక జనరల్ కోచ్‌లలోనూ ఫస్ట్ క్లాస్ తరహా శుభ్రత..!
భారత్‌పై పడే ప్రభావం ఇదే..
భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా వెచ్చించాల్సి రావడంతో లోటు పెరుగుతుంది. అలాగే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇదే సమయంలో భౌగోళిక అనిశ్చితి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నిజానికి రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు కత్తిమీద సాములా మారింది. డాలర్ నిల్వలను ఖర్చు చేసి కరెన్సీని కాపాడాలా? లేక పెరుగుతున్న చమురు ధరలను తట్టుకునేలా విధానాలు మార్చాలా? అనే డైలమాలో ప్రస్తుతం కేంద్ర బ్యాంకు ఉంది. కేవలం రూపాయి మాత్రమే కాకుండా ఇండోనేషియా రూపియా, ఫిలిప్పీన్స్ పెసో వంటి ఇతర ఆసియా కరెన్సీలు కూడా ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కుంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
-
IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్‌ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?