Site icon NTV Telugu

Star Bucks: స్టార్ బక్స్ కొత్త సీఈవోగా భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్

Lakshman Narasimhan

Lakshman Narasimhan

Star Bucks: ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్, గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, అడోబ్ ఐఎన్‌సీ ఛైర్మన్‌గా షాంతను నారాయణ్ నియమితులయ్యారు. తాజాగా ప్రపంచంలో అత్యధిక కాఫీ షాపులు కలిగి ఉన్న అమెరికా దిగ్జజం స్టార్ బక్స్ సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్‌కు చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. ఆయన ఇప్పటిదాకా డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను త‌యారు చేసే రెకిట్ సంస్థకు సీఈవోగా పని చేశారు. గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన 55 ఏళ్ల లక్ష్మణ్.. హోవార్డ్ షూల్జ్ స్థానంలో స్టార్ బక్స్ సీఈవో పదవి చేపట్టబోతున్నారు.

Read Also: Gold Rates: భారీగా తగ్గిన పసిడి ధరలు.. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం..!!

కాగా అక్టోబర్‌లో లక్ష్మణ్ నరసింహన్ స్టార్ బక్స్ కంపెనీలో చేరనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో సీఈవో బాధ్యతలను స్వీకరించనున్నారు. అప్పటివరకు షూల్జ్ సీఈవోగా కొనసాగుతారు. నరసింహన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా షూల్జ్ కంపెనీ బోర్డులో కొనసాగనున్నారు. అయితే సీవోగా లక్ష్మణ్ నరసింహన్ అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు. ప్రస్తుతం స్టార్‌బక్స్ కల్లోల్లాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంస్థ ప‌రిస్థితి అంతగా మెరుగ్గా లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న స‌మ‌యంలో ఆ సంస్థలో ప‌ని చేసే కార్మికులు త‌మ‌కు మెరుగైన ప్రయోజనాలు, వేతనాలు క‌ల్పించాల‌ని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో 200 కంటే ఎక్కువ US స్టోర్‌లు గత సంవత్సరంలో యూనియన్‌గా మారాయి. ఆ సంస్థ పదార్థాలు, లేబర్ అత్యధికంగా ఖర్చులను ఎదుర్కొంటోంది. చైనాలో కరోనా నేపథ్యంలో పరిమితుల కార‌ణంగా స్టార్ బక్స్ సంస్థ విదేశీ మార్కెట్ బిజినెస్ మంద‌గించింది.

Exit mobile version