Site icon NTV Telugu

Indian Musical Instruments Exports: భారతీయ సంగీతంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ

Indian Musical Instruments Exports

Indian Musical Instruments Exports

Indian Musical Instruments Exports: ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ప్రథమార్ధంలో మన దేశం నుంచి సంగీత వాయిద్యాల ఎగుమతులు 3.5 రెట్లకు పైగా పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ 172 కోట్ల రూపాయలుగా నమోదైంది. దాదాపు పదేళ్ల కిందట.. అంటే.. 2013-14 ఫైనాన్షియల్‌ ఇయర్‌లోని ఇదే సమయంలో ఈ ఎగుమతుల విలువ కేవలం 49 కోట్ల రూపాయలేనని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

read also: Playing Poker: పేకాట ఆడుతున్న 16 మంది అరెస్ట్‌.. 13లక్షలు స్వాధీనం

మన దేశ సంగీత వాయిద్య పరికరాల ఎగుమతిలో గ్రోత్‌ నెలకొనటం ప్రోత్సాహకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారతీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని, ఈ రంగంలో మరింత వృద్ధి సాధించటానికి ఇదే గొప్ప అవకాశమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియన్‌ మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పెరగటం పట్ల కేంద్ర ప్రభుత్వంలో ఉత్సాహం వెల్లువెత్తుతోందనటానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ ప్రకటనలు అద్దం పడుతున్నాయి.

Exit mobile version