Site icon NTV Telugu

India Post Payments : పెన్షనర్ల కోసం డిజిటల్ సర్వీస్‌ను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్..

Indian Post

Indian Post

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది.. సరికొత్త పథకాలను అందిస్తూ జనాలకు మంచి లాభాలాను ఇస్తుంది.. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతుంది.. ఇక తాజాగా ఇండియన్ పోస్టాఫీసు మరో కీలక నిర్ణయం తీసుకుంది.. సీనియర్ సిటిజెన్స్ కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను సులభతరం చేయడానికి కర్నాటక ప్రభుత్వ ట్రెజరీ కమిషనర్‌తో అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది.. ఈ సదుపాయం రూ. 5.4 లక్షల మంది పెన్షనర్లకు సహాయం చేసే అవకాశం ఉంది.. వృద్దులకు మంచి లాభాలను అందిస్తుంది.. ఇది నిజంగా వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

వ్యక్తిగతంగా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరాన్ని ఈ చొరవ దూరం చేస్తుందని భావిస్తున్నారు. బదులుగా, పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పోస్ట్‌మ్యాన్ ద్వారా ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పిపిఓ నంబర్ మరియు బయోమెట్రిక్ వివరాలతో పాటు పెన్షనర్ బ్యాంక్ ఖాతా వంటి వివరాలతో సమర్పించవచ్చు. ఒక్కో సేవకు రూ.70 చొప్పున వసూలు చేస్తారు.. దాన్ని తిరిగి మళ్లీ వారికే చెల్లిస్తారు.. ఈ పేమెంట్ సేవలు ప్రజలకు నిజంగా సహాయపడతాయని కొందరు భావిస్తున్నారు.. ఇకపోతే పోస్టాఫీస్ అందిస్తున్న కొన్ని స్కీమ్ లలో తాజాగా వడ్డీని కూడా పెంచినట్లు తెలుస్తుంది… ఈ పథకాలలో ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల ఎటువంటి రిస్క్ కూడా లేక పోవడంతో ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు..

Exit mobile version