Site icon NTV Telugu

మరోసారి ఐటీ రిటర్న్స్‌ గడువు పొడిగింపు..?

IT Return

IT Return

కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో గత ఏడాది నుంచి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు గడువును పొడిగిస్తూ వచ్చింది కేంద్రం.. అయితే, మరోసారి ఐటీ రిటర్న్స్‌ దాఖలు గడువును పొడిగించే అవకాశం కనిపిస్తోంది.. అయితే, ఈ సారి కొన్ని సాంకేతికపరమైన అంశాలనలో వాయిదా వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఎందుకంటే.. రెండున్నర నెల‌ల కింద‌ట కొత్తగా www.incometax.gov.in సైట్‌ను ప్రారంభించారు.. ఇప్పటికీ కొన్ని అవాంత‌రాలు ఎదురవుతూనే ఉన్నాయి.. దీంతో.. గ‌త ఆర్థిక సంవ‌త్సరాని (2020-21)కిగాను ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసే గ‌డువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) మరోసారి పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.. కాగా, ప్రస్తుతం ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లుకు సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కూ స‌మ‌యం ఉంది. కానీ,కొత్త వెబ్‌సైట్‌ పని విధానంపై సోషల్ మీడియా వేదికగా పలు ఫిర్యాదులు అందుతున్నాయి.. దీంతో.. మరోసారి వాయిదా వేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.. దీనిపై సీబీడీటీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Exit mobile version