Form 16: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఫాం-16 ఉండదు..
- ఆదాయ పన్ను విధానంలో కొత్త నిబంధనలు..
- ఫాం 16 స్థానంలో ఫారమ్ 130..
- ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయపు పన్ను నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వేతన జీవులకు అత్యంత కీలకమైన ఫారమ్-16 (Form 16) ఇకపై చరిత్ర కానుంది. దీని స్థానంలో ‘ఫారమ్-130’ (Form 130) అందుబాటులోకి రానుంది. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫారమ్-16 స్థానంలో ఫారమ్-130..
కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు-2026 ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులకు ఇచ్చే ట్యాక్స్ సర్టిఫికెట్ పేరు మారుతోంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, నివేదిక ఇచ్చే విధానంలో కూడా కొన్ని నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Also Read
- Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
ఇప్పటివరకు 1961 ఆదాయపు పన్ను చట్టం కింద ఫారమ్-16 ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం-2025 లోని సెక్షన్ 392/395 ప్రకారం ‘ఫారమ్-130’ను జారీ చేస్తారు. సాధారణంగా మనం పన్ను లెక్కించేటప్పుడు ‘అసెస్మెంట్ ఇయర్’ అనే పదాన్ని వాడతాము. అయితే కొత్త చట్టం ప్రకారం దీనిని ‘ట్యాక్స్ ఇయర్’ (Tax Year) గా మారుస్తున్నారు. దీనివల్ల సామాన్య పన్ను చెల్లింపుదారులకు గందరగోళం తగ్గి, ఏ సంవత్సరానికి పన్ను కడుతున్నామనేది స్పష్టంగా తెలుస్తుంది.
Also Read:Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్‌కు కారణం ఇదే..
ఫారమ్-130లో ఉద్యోగి, యజమాని మరిన్ని వ్యక్తిగత వివరాలను పొందుపరచాలి. ముఖ్యంగా ఈ-మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కంట్రీ కోడ్ వంటి వివరాలను తప్పనిసరి చేశారు. దీనివల్ల పన్ను విభాగానికి, పన్ను చెల్లింపుదారుడికి మధ్య కమ్యూనికేషన్ సులభం అవుతుంది. గతంలో ఫారమ్-16లో ఎంత పన్ను కట్ అయింది, ఎంత జమ అయింది అనే వివరాలు మాత్రమే ఉండేవి. కానీ ఫారమ్-130లో ఏ పన్ను రేటు (Rate of Tax) ప్రకారం టీడీఎస్ (TDS) కట్ చేశారో కూడా స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది.
ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ.. మీ చేతికి ఫారమ్-130 అందడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే కంపెనీలు వాడే హెచ్ఆర్ (HR) సాఫ్ట్‌వేర్, పేరోల్ సిస్టమ్స్, టీడీఎస్ రిటర్న్ సాఫ్ట్‌వేర్‌లను కొత్త నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది మార్పులు అర్థం చేసుకోవడంపై పన్ను చెల్లింపుదారులు దృష్టి సారించాలి. దీనివల్ల పన్ను లెక్కింపు మారకపోయినా.. పత్రాల సమర్పణలో జాగ్రత్తగా ఉండాలి.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!