ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు షాకిచ్చింది. క్రెడిట్ కార్డుల విషయంలో కీలక మార్పులు చేసింది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై లభించే రివార్డు ప్రయోజనాల్లో కోత పెట్టింది. గ్రాసరీ కొనుగోళ్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్యూయల్ సర్‌ఛార్జి రద్దు, లేట్ పేమెంట్ ఛార్జీల విషయంలో మార్పులు చేసింది. నవంబర్ 15 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈ మేరకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం ఇస్తోంది.
ఇది కూడా చదవండి: Chiranjeevi with Venkatesh: మెగాస్టార్ తో విక్టరీ వెంకటేష్.. భలే ఫ్రేమ్ బాసూ
యుటిలిటీ, ఇన్సూరెన్స్ చెల్లింపులపై కొత్తగా ఐసీఐసీఐ బ్యాంక్ పరిమితిని తీసుకొచ్చింది. ప్రీమియం కార్డు హోల్డర్లకు రూ.80వేల వరకు, సాధారణ కార్డు హోల్డర్లకు రూ.40 వేలు వరకు మాత్రమే ఇకపై రివార్డులు అందనున్నాయి. గ్రాసరీ, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో చేసే ఖర్చులపై వచ్చే రివార్డులపైనా కొన్ని కార్డులపై రూ.40వేలు, మరికొన్ని కార్డులపై రూ.20వేలు వరకు మాత్రమే రివార్డులు చెల్లిస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ఇక పెట్రోల్ పంపుల్లో ఫ్యూయల్ కొనుగోలుపై విధించే సర్‌ఛార్జి రద్దు ఇకపై నెలకు రూ.50వేల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆపై కొనుగోళ్లకు సర్‌ఛార్జి చెల్లించాల్సిందే.
ఇది కూడా చదవండి: Crime: భార్య మాస్టార్ ప్లాన్! 20 రోజుల్లో భర్త కుటుంబానికి చెందిన 5 మంది మృతి..
ఇదిలా ఉంటే ఆలస్య చెల్లింపుల విధానాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ మార్చింది. రూ.100 వరకు ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.100 నుంచి రూ.500 వరకు రూ.100; రూ.501 నుంచి రూ.1000 వరకు రూ.500; రూ.1001 నుంచి రూ.5000 వరకు రూ.600, రూ.5001 నుంచి రూ.10వేలు వరకు రూ.750, రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు రూ.900, రూ.50వేల పైన రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది.