Site icon NTV Telugu

ICICI Bank : రోజుకు రూ.165పొదుపు చేస్తే.. రూ.8.5లక్షలు పొందే ఛాన్స్

New Project (8)

New Project (8)

ICICI Bank : ఆర్థిక మాంద్యం తరుముకొస్తున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మనీ ఇండాల్సిందే. మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ కింద దాచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో రాబోవు ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. అలా డబ్బులను దాచుకోవాలని చూసే వారి ఐసీఐసీఐ బ్యాంక్ ఓ శుభవార్త తెలిపింది. రోజుకు రూ.165పొదుపు చేస్తే.. రూ.8.5లక్షలు పొందే ఛాన్స్ కల్పిస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు దాచుకోవాలనుకునే వారికి మంచి వడ్డీ వచ్చే స్కీంలను ఐసీఐసీఐ ప్రకటించింది. నచ్చిన టెన్యూర్ ఎంపిక చేసుకొని డబ్బులు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి మీ డబ్బుతో పాటు వడ్డీని పొందొచ్చు. ఒకేసారి కాకుండా ప్రతి నెలా కొంత మొత్తం దాచుకోవాలని భావిస్తే మాత్రం రికరింగ్ డిపాజిట్లను ఎంచుకుంటే సరిపోతుంది.

Read Also: Russia Ukraine War : సైనికులకు వయాగ్రా.. ఇక రెచ్చిపోండి అంటున్న రష్యా

ఐసీఐసీఐ బ్యాంక్‌లో మీరు 6 నెలల నుంచి 120 నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకొని డబ్బులు పెడుతూ వెళ్లాలి. నెలకు కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ఆర్‌డీ అకౌంట్లపై వచ్చే వడ్డీ మొత్తంపై ట్యాక్స్ పడుతుంది. టీడీఎస్ కట్ అవుతుంది. సాధారణ ఆర్‌డీల కన్నా సీనియర్ సిటిజన్స్ ఆర్‌డీలకు అధిక వడ్డీ వస్తుంది. సాధారణ కస్టమర్లకు ఆర్‌డీ అకౌంట్‌పై 4.25 శాతం నుంచి 6.1 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌ ఆర్‌డీ అకౌంట్‌పై అయితే 4.75 శాతం నుంచి 6.6 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ ఆధారపడి ఉంటుంది.

Read Also: Rishi-Sunak: రిషి సునాక్ ప్రధాని అవుతారా.. బ్రిటన్‎లో జోరుగా బెట్టింగ్

ఉదాహరణకు మీరు నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే.. 6.6 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీకు పదేళ్ల తర్వాత చేతికి రూ. 8.5 లక్షల వరకు వస్తాయి. ఇందులో మీరు పెట్టిన మొత్తం రూ. 6 లక్షలు అవుతుంది. వడ్డీ రూపంలో దాదాపు రూ.2.5 లక్షలు వస్తాయి. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారికి ఇది అనువుగా ఉంటుంది. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేని వారు కూడా ఈ ఆర్‌డీ స్కీమ్‌ను ఒకసారి పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంకా ఇతర బ్యాంకులు కూడా ఈ సేవలు అందిస్తున్నాయి. అందువల్ల అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవడం ఉత్తమం.

Exit mobile version