Site icon NTV Telugu

Hyundai Car Discounts: భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూందాయ్.. ఏకంగా రూ.1.10 లక్షలు..

Hyundai Carsss

Hyundai Carsss

హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కార్ల ప్రేమికుల కోసం ఏప్రిల్ 2026 నెలలో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ (SUV) మరియు ఎలక్ట్రిక్ కార్లపై ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన మోడల్స్‌పై గరిష్టంగా రూ. 1.10 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో ఈ రాయితీలు లభిస్తాయి.

ఏ కారుపై ఎంత తగ్గింపు అంటే..

హ్యుందాయ్ వెర్నా (Verna).. ఈ నెలలో అత్యధికంగా వెర్నా పాత స్టాక్‌పై రూ. 1.10 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. సెడాన్ కార్లు ఇష్టపడే వారికి ఇది మంచి అవకాశం. క్రెటా ఎలక్ట్రిక్ (Creta EV) ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి రూ. 1 లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. పర్యావరణానికి మేలు చేసే ఈ కారు ధరను తగ్గించడం వల్ల కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించనుంది. గ్రాండ్ i10 నియోస్ ఫేమస్ సిటీ కారుపై రూ. 68,000 వరకు డిస్కౌంట్ ఉంది. ఇది పెట్రోల్ మరియు సిఎన్‌జి వెర్షన్లలో అందుబాటులో ఉంది.

Also Read:Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్‌లో రెడీ చేసుకోండి!

హ్యుందాయ్ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుపై రూ. 58,000 వరకు ఆదా చేసుకోవచ్చు. స్పోర్ట్స్ మోడల్స్ ఇష్టపడే వారికి ఇది సరైన ఛాన్స్. హ్యుందాయ్ క్రెటా (Creta)లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటా పెట్రోల్ మోడల్స్‌పై రూ. 55,000 వరకు రాయితీ ప్రకటించారు. అల్కాజార్ (Alcazar) కారుపై పెట్రోల్ వెర్షన్ కి రూ. 70,000, డీజిల్ వెర్షన్ కి రూ. 30,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఆరా (Aura) కారుపై తక్కువగా అంటే రూ. 20,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.

వచ్చే నెలల్లో కార్ల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో.. ఈ ఏప్రిల్ నెలలో కారు కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీకు దగ్గరలోని హ్యుందాయ్ డీలర్‌ను కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Exit mobile version